భారత్‌బంద్‌తో టీఎన్జీవోలకు ఏం సంబంధం..? బండి సంజయ్ ఫైర్
మరికొన్ని గంటల్లో రైతుల పిలుపుతో దేశవ్యాప్తంగా భారత్ బంద్ జరగనుంది. బంద్‌కు అనుకూలంగా విపక్షాలతోపాటు ప్రజా సంఘాలు కూడా మద్దతు తెలుపుతున్నాయి. వ్యతిరేకంగా అధికార బీజేపీ కౌంటర్ ఇస్తోంది. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్.. నేతలపై ఫైరయ్యారు. అయితే ఉద్యోగ సంఘాల నేతలు కూడా బంద్‌కు మద్దతు తెలుపడాన్ని తప్పుపట్టారు.
టీఎన్జీవో నాయకుల తీరుపై బండి సంజయ్ మండిపడ్డారు. టీఎన్జీవో నాయకులకు రైతు బంద్‌తో సంబంధం ఏంటి అని అడిగారు. ఉద్యోగుల సమస్యలపై కొట్లాడాల్సిన నేతలు.. సీఎం కేసీఆర్ అడుగులకు మడుగులు ఎత్తుతున్నారు అని ఫైరయ్యారు. ఐఆర్, పీఆర్సీల గురించి మాట్లాడాల్సిన నేతలు.. భారత్ బంద్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. రుణమాఫీ, కనీస మద్దతు ధరపై ఉద్యోగ సంఘాలు ఎందుకు స్పందించలేదు అని ప్రశ్నించారు.

భారత్ బంద్ ఉదయం 11 గంటలకు ప్రారంభం అవుతోందని భారతీయ కిసాన్ యూనియన్ అధికార ప్రతినిధి రాకేశ్ టికాయత్ తెలిపారు. దీంతో ఆఫీసులకు వెళ్లేవారు నిరభ్యంతరంగా వెళ్లొచ్చని చెప్పారు. మధ్యాహ్నం 3 గంటలకు బంద్ ముగిస్తామని వెల్లడించారు. ఆ సమయం వరకు చాలా కార్యాలయాలు విధుల్లో ఉంటాయని తెలిపారు. 3 తర్వాత అన్నీ యధావిధిగా కొనసాగుతాయని పేర్కొన్నారు. ఆ తర్వాత సాధారణంగా ఉండటంతో.. జనం బయట తిరగొచ్చు అని వెల్లడించారు.












Click it and Unblock the Notifications