మోడీ ది బాస్: తానూ మాస్ లీడర్‌నే అంటూ సీఏలకు బండి సంజయ్ కీలక సూచనలు

హైదరాబాద్: తనకు స్టైల్‌గా మాట్లాడటం రాదని.. తాను ఒక మాస్ లీడర్‌ని అని చెప్పుకొచ్చారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. శనివారం హైదరాబాద్ హైటెక్ సిటీలోని శిల్పకళావేదికలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ICAI) స్నాతకోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరై సీఏలో యువతను ఉద్దేశించి మాట్లాడారు. తాను మాస్ లీడర్‌ని అని.. మీరు కూడా క్లాస్‌లో మాస్ అని అన్నారు.

ఇంత మంచి కార్యక్రమానికి హాజరవడం చాలా సంతోషంగా ఉందన్న బండి సంజయ్.. భారత జాతి నిర్మాతలంటూ వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ దేశానికి పేరు రావాలని సీఏ చేసిన వ్యక్తులు మీరు. సీఏ టఫ్ కోర్స్. నూటికి ఒక్కరు కూడా పాస్ కాలేని పరిస్థితి ఉంటది. కానీ మీరంతా పట్టుదల, కసితో పాసయ్యారు. మోడీ పేరు చెబితే అంతా చప్పట్లు కొడుతున్నరు. ఒక దేశ ప్రధాని మోడీ ది బాస్ అంటే.. ఇంకో ప్రధాని ఏకంగా పాదాభివందనం చేస్తున్నారు. విదేశాల్లో మన ప్రధానికి గౌరవం పెరిగిందంటే.. అది మనందరికీ గౌరవం దక్కినట్లేన్నారు. కానీ, కొన్ని పార్టీలు ఆయన ఇమేజ్‌ను తగ్గించే ప్రయత్నం చేయడం బాధాకరమని వ్యాఖ్యానించారు.

 bandisanjaicaconvications

గతంలో ఇదే మోడీకి పాస్ పోర్టు ఇవ్వబోనని నిరాకరించిన దేశాలే.. ఇవ్వాళ రెడ్ కార్పెట్ వేసి ఘన స్వాగతం పలుకుతున్నాయన్నారు బండి సంజయ్. నిరంతరం దేశం గురించి ఆలోచించే మోడీ నాయకత్వంలో తాను ఎంపీగా ఉన్నందుకు గర్వంగా ఉందన్నారు బండి. తనను ఎంపీగా చేసిన కరీంనగర్ ప్రజలకు రుణపడి ఉంటానన్నారు.

 bandisanjaycaconvications-

మోడీ పీఎం అయ్యాక దేశ ఎకానమీ గ్రోత్ బాగా పెరగిందన్నారు. ఆజాద్ కా అమ్రుతోత్సవం నుంచి అమ్రుత్ కాల వైపు పయనిస్తున్నాం. ఇయాళ దేశ ఆర్దిక పరిస్థితి గతంలో 10వ స్థానంలో ఉండే... ఇప్పుడు 5వ స్థానంలోకి వచ్చిందన్నారు. ప్రధాని మోడీ 2047 నాటికి భారత్ నెంబర్ వన్ చేసేందుకు క్రుషి చేస్తున్నారన్నారు బండి సంజయ్.

ఇక, సీఏ అంటే అకౌంట్స్ చేసేవాళ్లు మాత్రమే కాదు.. మాలాంటి సామాన్యులంతా 10 మైనస్ 2 అంటే 8 అని చెబుతాం... మీరు మాత్రం మీకెంత కావాలో చెప్పండి అని అంటారు. కానీ, మీరంతా ఈ దేశ భవిష్యత్తు తలరాతను మార్చే సత్తా మీకే ఉంది. మీ క్లయింట్స్ సకాలంలో పన్నులు కట్టేలా చూడండి. బ్లాక్ మనీని అరికట్టండి. వారికి సిస్టమ్‌తో సమస్యలొస్తే... వాటిని తొలగించి సంస్థ ఉన్నతికి తోడ్పడండి బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఈరోజు విదేశీ పెట్టుబడులు మాతోనే వచ్చాయని రాజకీయ నాయకులుగా మేం చెప్పుకుంటాం... కానీ మీవల్లే పెట్టుబడులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఇండియా అంటే సేఫ్ జోన్‌గా చూపాల్సిన బాధ్యత మీపై ఉందంటూ సీఏలకు సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+