Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వాళ్ళ విషయంలో కేసీఆర్ మనసు కరగటంలేదా? మళ్ళీ పాత పంచాయితీపై భగ్గుమన్న బండి సంజయ్!!

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిత్యం అధికారంలో ఉన్న ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి రాష్ట్రంలోని వివిధ సమస్యలను తెరమీదకు తీసుకువస్తున్నారు. నిన్నటి వరకు కామారెడ్డి, జగిత్యాల మాస్టర్ ప్లాన్ లపై రైతులకు మద్దతుగా పోరాటం సాగించిన బండి సంజయ్, ఇప్పుడు కామారెడ్డి, జగిత్యాల మాస్టర్ ప్లాన్లను రద్దు చేయాలని మున్సిపాలిటీలో తీర్మానం చేయడంతో మళ్లీ ఇప్పటివరకు అపరిష్కృతంగా ఉన్న మరొక సమస్యను తెరమీదకి తీసుకువచ్చారు. తాజాగా టీచర్లు ప్రగతి భవన్ ని ముట్టడించడానికి ప్రయత్నించడంతో, 317 జీవో సవరణపై కేసీఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు.

మానవ సంబంధాలు.. భావోద్వేగాలు.. మీకు పట్టవా? బండి సంజయ్

మానవ సంబంధాలు.. భావోద్వేగాలు.. మీకు పట్టవా? బండి సంజయ్

టీచర్ల విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ వైఖరిని తప్పు పట్టిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రగతి భవన్ ముట్టడించడానికి వచ్చిన టీచర్లను వారి పిల్లలు ఏడుస్తున్నప్పటికీ పట్టించుకోకుండా పోలీసులు అరెస్ట్ చేసి పంజాగుట్ట, బొల్లారం, గోషామహల్ పోలీస్ స్టేషన్ లకు తరలించారని మండిపడ్డారు. ఇక అక్కడ కూడా తల్లులు ఏడుస్తున్న తమ పిల్లల్ని తీసుకుని నిరసనకు దిగారని, కనీసం భోజనం వసతులు కల్పించలేదని , మానవత్వం లేని ప్రభుత్వమన్నారు. ఇక ఈ ఘటనపై మండిపడిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తల్లులను పిల్లలను వేరు చేసే అరెస్టు చేస్తారా? ఓట్లు, సీట్ల రాజకీయం తప్ప, మానవ సంబంధాలు.. భావోద్వేగాలు.. మీకు పట్టవా? అంటూ విరుచుకుపడ్డారు.

వినాశకాలే విపరీత బుద్ధి: కేసీఆర్ పై విరుచుకుపడిన బండి సంజయ్

వినాశకాలే విపరీత బుద్ధి: కేసీఆర్ పై విరుచుకుపడిన బండి సంజయ్

అంతేకాదు మానవతలేని మృగానివి.. వినాశకాలే విపరీత బుద్ధి అంటూ తీవ్ర పదజాలంతో కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. అసలు టీచర్లు చేసిన తప్పేంటో చెప్పాలని ప్రశ్నించిన బండి సంజయ్ భార్యాభర్తలు ఒకే చోట కలిసి పనిచేసే అవకాశం కల్పించాలని అడగడం నేరమా అంటూ ప్రశ్నించారు. 317 జీవో సవరణపై ఉద్యోగులు, ఉపాధ్యాయుల డిమాండ్లను పరిష్కరించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఇక ఈ విషయంలో ప్రజాస్వామ్యవాదులు కూడా స్పందించాలని బండి సంజయ్ పేర్కొన్నారు.

టీచర్లను అరెస్టు చేసిన తీరు చూసి సభ్య సమాజం అసహ్యించుకుంటుంది

టీచర్లను అరెస్టు చేసిన తీరు చూసి సభ్య సమాజం అసహ్యించుకుంటుంది

317 జీవోను సవరించాలని కోరుతూ ప్రజాస్వామ్యబద్ధంగా రెండు రోజులుగా ఆందోళన చేస్తున్న ఉపాధ్యాయుల పట్ల పోలీసుల వైఖరి అత్యంత అమానుషంగా ఉందని బండి సంజయ్ పేర్కొన్నారు. బిజెపి అధికారంలోకి రాగానే 317 జీవోను సవరిస్తామని బండి సంజయ్ హామీ ఇచ్చారు. చంటి పిల్లలు ఏడుస్తున్న తల్లిని, పిల్లలను వేరు చేస్తూ ఈడ్చుకుంటూ అరెస్టు చేయడం సిగ్గుచేటని, టీచర్లను అరెస్టు చేసిన తీరు చూసి సభ్య సమాజం అసహ్యించుకుంటుందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. పిల్లలతో కలిసి టీచర్ల కుటుంబాలు నడిరోడ్డు పై ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నా సీఎం కేసీఆర్ మనసు కరగకపోవడం దారుణమన్నారు.

కేసీఆర్ సర్కార్ కు పోయే కాలం దాపురించే టీచర్ లతో ఇలా ..

కేసీఆర్ సర్కార్ కు పోయే కాలం దాపురించే టీచర్ లతో ఇలా ..

భార్యను ఒకచోట, భర్తను ఇంకోచోట బదిలీ చేయడం అన్యాయమని, రెండేళ్లు కావస్తున్నా సమస్యను పరిష్కరించకుండా అమానుషంగా వ్యవహరించటం అత్యంత దారుణమని బండి సంజయ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. 317 జీవోను సవరించాలని కోరుతూ గత ఏడాది ప్రజాస్వామ్య బద్దంగా ఆందోళన చేసిన తనను, బిజెపి కార్యకర్తలను అరెస్టు చేసి అమానుషంగా జైల్లో పెట్టారని బండి సంజయ్ గుర్తు చేశారు. కెసిఆర్ సర్కార్ కు పోయేకాలం దాపురించిందని, వినాశ కాలం వచ్చినప్పుడు ఇటువంటి విపరీత బుద్ధులు పుడతాయని అన్నారు. టీచర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, లేనిపక్షంలో బిజెపి అధికారంలోకి వచ్చిన వెంటనే 317 జీవోను సవరించి ఉద్యోగ, ఉపాధ్యాయులకు న్యాయం చేస్తామని బండి సంజయ్ వెల్లడించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+