వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అర్దరాత్రి మునుగోడుకు బయలుదేరిన బండి సంజయ్.. అడుగడుగునా ఉద్రిక్తత; జాతీయ రహదారిపై ఆందోళన; అరెస్ట్!!

|
Google Oneindia TeluguNews

మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు నియోజకవర్గం లోనే ఉండి ప్రలోభాలకు గురి చేస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన ఆందోళనకు మద్దతుగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మునుగోడు కు వెళ్లే ప్రయత్నం చేశారు. అడ్డుకున్న పోలీసులు రామోజీ ఫిలిం సిటీ వద్ద రోడ్డు పైన బైఠాయించి ఆందోళన చేపట్టిన బండి సంజయ్ ను అరెస్ట్ చేశారు.

జాతీయ రహదారిపై బండి సంజయ్ ఆందోళన


టిఆర్ఎస్ పార్టీ నేతలకు సహకరిస్తూ పోలీసులు బీజేపీ కార్యకర్తలను కొడుతున్నారని, పోలీసుల తీరుకు వ్యతిరేకంగా మునుగోడుకు వెళ్ళే ప్రయత్నం చేసిన బండి సంజయ్ ను పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. దీంతో జాతీయ రహదారిపై బైఠాయించిన బండి సంజయ్ ఆధ్వర్యంలో బిజెపి కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. బిజెపి నాయకుల వాహనాలను ఆపి పోలీసులు వారిపై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. పోలీసుల జులుం నశించాలని నినాదాలు చేశారు. మునుగోడు నియోజకవర్గంలో స్థానికేతర మంత్రులు ఎమ్మెల్యేలు తిష్టవేసి అరాచకాలకు పాల్పడుతుంటే ఎందుకు అడ్డుకోలేదని పోలీసులను నిలదీశారు. బండి సంజయ్ ను చుట్టుముట్టిన పోలీసులు, ఆయనను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులతో వాగ్వాదం జరిగింది.

మునుగోడులో ఉన్న స్థానికేతరులను బయటకు పంపే దాకా ఆందోళన చేస్తామన్న బండి సంజయ్

బండి సంజయ్ ఆందోళనతో విజయవాడ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఇక బండి సంజయ్ కి మద్దతుగా కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఇక అనేక ఉద్రిక్తతల మధ్య బండి సంజయ్ జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. మునుగోడు నియోజకవర్గం నుండి స్థానికేతర మంత్రులను, ఎమ్మెల్యేలను బయటకు పంపే దాక ఇక్కడి నుండి కదిలేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు బండి సంజయ్. బండి సంజయ్ ను అరెస్ట్ చేయడానికి భారీగా వచ్చిన పోలీసులు కార్యకర్తలను చెదరగొట్టి బండి సంజయ్ ను అదుపులోకి తీసుకున్నారు.

బండి సంజయ్ అరెస్ట్ .. అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ లో బండి సంజయ్

ఆ పై బండి సంజయ్ ను బలవంతంగా అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇక పోలీస్ స్టేషన్ వద్ద కూడా బండి సంజయ్ ఆందోళన కొనసాగుతోంది. పోలీసులకు వ్యతిరేకంగా పోలీస్ స్టేషన్ ఎదుట బిజెపి కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు. అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ లోనే బండి సంజయ్ నిర్బంధం కొనసాగుతుంది. ఇక బండి సంజయ్ తోపాటు పోలీస్ స్టేషన్లో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు వీరేందర్ గౌడ్, ఎన్. వి.సుభాష్,జెనవాడే సంగప్ప తదితరులు ఉన్నారు.

English summary
There was tension at every step as the police stopped Bandi Sanjay who had tried to go munugode in the mid night. Due to this, Bandi Sanjay protested on the national highway and the police arrested him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X