కేసీఆర్ కు బండి సంజయ్ వార్నింగ్ .. వాళ్ళలా నువ్వు కూడా జైలుకే వెళ్తావ్ అంటూ ఫైర్
తెలంగాణ సీఎం కేసీఆర్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వార్నింగ్ ఇచ్చారు. కెసిఆర్ నువ్వు కూడా జైలు కి వెళ్తావ్ అంటూ బండి సంజయ్ కెసిఆర్ ను ఉద్దేశించి హెచ్చరించారు. లాలూ ప్రసాద్ యాదవ్, కరుణానిధి విషయంలో ఏం జరిగిందో కెసిఆర్ గుర్తు చేసుకోవాలని ఆయన హితవు పలికారు.
తెలంగాణలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో నాంపల్లిలోని టిఎస్పిఎస్సి కార్యాలయం ముందు మెరుపు ధర్నా నిర్వహించారు.

ఊహించని విధంగా ఒక్కసారిగా మెరుపు సమ్మెకు దిగడంతో పోలీసులు బిజెపి కార్యకర్తలను అడ్డుకున్నారు. కొద్దిసేపు తోపులాట తరువాత ఉద్రిక్త పరిస్థితుల మధ్య బీజేపీ శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ధర్నాలో బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేయడంపై కెసిఆర్ ను ఉద్దేశించి బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా సందర్భంగా అరెస్ట్ చేసిన బీజేవైఎం నాయకుడు భాను ప్రకాష్ ను పోలీసులు వెంటనే విడుదల చేయాలన్న బండి సంజయ్, భానుని తక్షణం విడుదల చేయాలనేది డిమాండ్ కాదని వార్నింగ్ అని పేర్కొన్నారు.
భాను ప్రకాష్ అరెస్టు విషయంలో ఐజి ప్రభాకర్ కు సిగ్గుండాలని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. పోలీసులు భాను ప్రకాష్ పై చెయ్యి వేస్తే, తాము కేసీఆర్ ఫామ్ హౌస్ పై చెయ్యి వేయాల్సి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు . సీఎం కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయం అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications