Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నాపై చర్యలు తర్వాత..ముందు కేసీఆర్‌పై, ఆ మంత్రులపై చర్యలు తీసుకోండి: వైఎస్ షర్మిల

వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రస్థానం పాదయాత్ర ద్వారా ప్రజాక్షేత్రంలోకి వెళుతున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల ప్రజాప్రస్థానం పాదయాత్రలో గతంలో మంత్రి నిరంజన్ రెడ్డి తనపై మంగళవారం మరదలు అంటూ చేసిన వ్యాఖ్యలపై వైయస్సార్ షర్మిల ఎవడ్రా నీకు మరదలు అంటూ తీవ్రస్థాయిలో విరుచుకు పడి ఆయనను వీధికుక్కతో పోల్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వైఎస్ షర్మిల ను టార్గెట్ చేస్తూ టిఆర్ఎస్ పార్టీ నేతలు వైయస్ షర్మిల పై చర్య తీసుకోవాలని స్పీకర్ కు ఫిర్యాదు చేశారు.

వైఎస్ షర్మిల ను టార్గెట్ చేసిన టీఆర్ఎస్, స్పీకర్ కు, డీజీపీకి ఫిర్యాదు

వైఎస్ షర్మిల ను టార్గెట్ చేసిన టీఆర్ఎస్, స్పీకర్ కు, డీజీపీకి ఫిర్యాదు

శాసనసభ్యుల గౌరవాన్ని వైయస్ షర్మిల కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక ఈ విషయంపై మంత్రులు ఎమ్మెల్యేలతో చర్చించి స్పీకర్ తగిన చర్యలు తీసుకుంటామంటూ, సభ్యుల హక్కులను పరిరక్షిస్తామని హామీ ఇచ్చారు. షర్మిలపై మంత్రులు ఇచ్చిన ఫిర్యాదును సభా హక్కుల ఉల్లంఘన కమిటీకి పంపించారు . ఇక దీనిపై సభా హక్కుల ఉల్లంఘన కమిటీ బుధవారం సమావేశమై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే తనపై షర్మిల చేసిన అనుచిత వ్యాఖ్యలపై మంత్రి నిరంజన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర డిజిపికి ఫిర్యాదు చేశారు.

కేసీఆర్ వీడియో పోస్ట్ చేసి ముందు కేసీఆర్ పై చర్య తీసుకోమన్న షర్మిల

కేసీఆర్ వీడియో పోస్ట్ చేసి ముందు కేసీఆర్ పై చర్య తీసుకోమన్న షర్మిల

దీంతో వైయస్ షర్మిల ఏ మాత్రం తగ్గకుండా ప్రభుత్వంపై పోరాటం మొదలుపెట్టారు. సోషల్ మీడియా వేదికగా కేంద్ర ప్రభుత్వం పై, ప్రధాని నరేంద్ర మోడీ పై సీఎం కేసీఆర్ తిట్లదండకానికి సంబంధించిన ఒక వీడియోను పోస్ట్ చేసి మరి దీన్నేమంటారు అంటూ ప్రశ్నించారు. స్పీకర్ గారు తన పై చర్యలు తీసుకునే ముందు కెసిఆర్ దొరగారి నోటినుంచి జాలువారిన ఆణిముత్యాలు చూసి, విని ఆయనపైన ముందు చర్యలు తీసుకోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అని పేర్కొన్నారు.

మరదలు అన్న మంత్రిపై కఠిన చర్య తీసుకోండి

మరదలు అన్న మంత్రిపై కఠిన చర్య తీసుకోండి

అంతేకాదు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు నాపై చర్యలకు ఆలోచించే ముందు పరాయి ఆడదాన్ని, ఒక తల్లిని మరదలంటు నన్ను కించపరిచి నన్ను, నాతోటి మహిళలను అవమాన పరిచిన సంస్కార హీనుడైన మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నానని వైయస్ షర్మిల పేర్కొన్నారు. తనను అవమానపరిచిన వ్యక్తిని తాను ఎందుకు ప్రశ్నించొద్దు అన్నట్టు వైఎస్ షర్మిల ఇదెక్కడి న్యాయం అని తన పోస్ట్ ద్వారా నిలదీశారు.

మహిళనని.. మంగళవారం వ్రతం అని అవమానించిన కేటీఆర్ పై చర్యలు తీసుకోండి

మహిళనని.. మంగళవారం వ్రతం అని అవమానించిన కేటీఆర్ పై చర్యలు తీసుకోండి

మళ్లీ మరోమారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు అని సంబంధించిన వైయస్ షర్మిల ఉద్యోగాల కోసం ఆత్మహత్యలు చేసుకుంటున్న నిరుద్యోగ యువతకు తోడుగా ప్రతి మంగళవారం నేను చేస్తున్న నిరుద్యోగ నిరాహార దీక్షలను వ్రతాలంటూ.. నన్ను, ఏ పనినైనా నిష్టగా చేసే ప్రతి మహిళను, నిరుద్యోగులను కించపరిచిన మరో మంత్రి కేటీఆర్ పై కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా అంటూ పేర్కొన్నారు.

భయపడేది లేదన్న షర్మిల .. ఆసక్తికరంగా రాజకీయం

భయపడేది లేదన్న షర్మిల .. ఆసక్తికరంగా రాజకీయం

టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల ఫిర్యాదు చేసినంత మాత్రాన భయపడేది లేదని, తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తరువాతే తాను మాట్లాడానని, ముందు టిఆర్ఎస్ పార్టీ నేతల భాష మార్చుకోవాలని వైయస్ షర్మిల తన పోస్టుల ద్వారా చెప్పకనే చెప్పారు. ఇక వైయస్ షర్మిల ను టార్గెట్ చేసిన టిఆర్ఎస్ పార్టీ ఈ వ్యవహారంలో ఏం చేయబోతోంది? దానిని వైయస్ షర్మిల ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు అన్నది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఆసక్తి కరంగా మారింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+