Bharat Ratna:మౌనముని, ఆర్దిక రంగం టు అణుశక్తి వరకు అన్నింటా పీవీ ముద్ర...!!
దేశాన్ని ప్రగతి పథం వైపు నడించిన సంస్కర్త. రాజకీయ దురంధరుడు. దక్షిణాది తొలి ప్రధాని. మౌనముని.. మన తెలుగు బిడ్డ పాములపర్తి వెంకట నరసింహరావుకు భారత రత్న పురస్కారం లభించింది.. 61 ఏళ్ల తర్వాత మళ్లీ తెలుగు తేజం భారత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు భారతరత్న లభించింది. ఆర్దిక రంగం నుంచి అణుశక్తి వరకు ..అంతర్గత భద్రత నుంచి విదేశాంగ విధానం వరకు అన్నింటా దేశంలో పీవీ ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. దేశ ఆర్దిక గతిని మార్చేసిన దార్శినికుడుకు ఇప్పుడు భరతరత్న పురస్కారం దక్కింది.
తెలుగు బిడ్డకు పురస్కారం : బహుబాష కోవిదుడు, ఆధునిక భారత్ కు బాటలు పరిచిన నేత పీవీ నరసింహ రావుకు అత్యన్నత పురస్కారం భారతరత్న దక్కింది. పీవీకి భారత రత్నకు ఎంపిక చేయటం పైన కేంద్రానికి తెలుగు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. పీవీ నరసింహారావు తెలంగాణలోని వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లిలో 1921 జూన్ 28న రుక్నాబాయి, సీతారామారావు దంపతులకు పీవీ జన్మించారు. 1951 లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో సభ్యుడిగా చేరిన ఆయన తన రాజకీయ జీవితాన్ని జర్నలిస్టుగా ప్రారంభించారు. 1957 లో శాసనసభ్యుడిగా రాజకీయ జీవితం ప్రారంభించారు. 1971 సెప్టెంబర్ 30న ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. తొమ్మిది సంవత్సరాల పాటు ఆయన న్యాయ, సమాచార, వైద్య, దేవాదాయ శాఖల మంత్రిగా పనిచేశారు.

ఆర్దిక సంస్కరణలకు పునాది : 1971లో జరిగిన పరిణామాలతో పీవీని కాంగ్రెస్ అధిష్టానం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నియమించింది. రెండు సంవత్సరాల పాటు ఆ పదవిలో కొనసాగిన ఆయన తర్వాత రాష్ట్ర రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు. 1977లో హనుమకొండ లోక్‌సభస్థానం నుంచి పోటీ చేసి కేంద్ర రాజకీయాల్లో అడుగుపెట్టారు. 1980లో జరిగిన ఎన్నికల్లో మరోసారి ఇదే నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత 1984, 89 సంవత్సరాల్లో మహారాష్ట్రలోని రాంటెక్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. కేంద్రంలో హోంశాఖ, విదేశీ వ్యవహారాల శాఖ, మానవ వనరుల అభివృద్ధి శాఖలలో పనిచేశారు. రాజీవ్ గాంధీ హత్య కారణంగా కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకుడు లేకుండా పోయాడు. ఆ సమయంలో పీవీ మాత్రమే ఆ పదవికి సరైన దిక్కయ్యారు. 1991లో అనూహ్యంగా అత్యున్నతమైన ప్రధానమంత్రి పదవి వరించింది. 1996 వరకు ప్రధానమంత్రి పనిచేశారు. పీఎం పదవి చేపట్టిన తొలి తెలుగు వ్యక్తిగా, దక్షిణ భారతీయుడిగా చరిత్రలో నిలిచిపోయారు.

అనూహ్యంగా పీఎం పదవి : దివాలా తీసే స్ధాయికి చేరుకున్న ఆర్ధిక వ్యవస్థలకు పీవీ పునరుజ్జీవనం కల్పించేందుకు కొత్త సంస్కరణలకు బీజం వేసారు. అందుకే పీవీని ఆర్ధిక సంస్కరణల పితామహుడు అంటారు. పంజాబ్ తీవ్రవాదాన్ని విజయవంతంగా అణచివేసిన ఘనత పీవీ ప్రభుత్వానిదే. 1998 లో వాజపేయి ప్రభుత్వం జరిపిన అణు పరీక్షల కార్యక్రమం మొదలు పెట్టింది పీవీ ప్రభుత్వమే. పీవీ నర్సింహారావు సత్యమ్మరావును వివాహం చేసుకున్నారు. 1970, జూలై 1 న ఆమె కన్నుమూసారు. పీవీకి ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు. హైదరాబాదులో భారతదేశంలోనే అతిపెద్ద ఫ్లై ఓవర్ కు 'పి.వి. నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వే' అని పేరుపెట్టారు. ప్రస్తుతం పీవీ కుమార్తె వాణీదేవి తెలంగాణ శాసనమండలి సభ్యురాలిగా ఉన్నారు. పీవీ మరణం తరువాత ఆయన పార్దీవ దేహం విషయంలో కాంగ్రెస్ వ్యవహరించిన తీరు వివాదాస్పద మైంది. ఇప్పుడు ప్రధాని మోదీ పీవికి భారత రత్న ద్వారా మరోసారి పీవీకి అనుకూలురైన కాంగ్రెస్ వాదులను ఆకర్షించే ప్రయత్నం చేసారు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications