కెసిఆర్ వ్యాఖ్యకు నారా భువనేశ్వరి రిప్లై: అమ్మ మాటను ట్వీట్ చేసిన లోకేష్
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి టీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తానని తమ కార్యకర్తలతో చెప్పారంటూ ఆ పార్టీ అధినేత కె. చంద్రశేఖర రావు చేసిన వ్యాఖ్యలపై భువనేశ్వరి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.
తన ఓటు ఎప్పటికీ తెలుగుదేశం పార్టీకేనని ఆమె స్పష్టం చేశారు. ఈమేరకు భువనేశ్వరి ఖండనను ఆమె కుమారుడు లోకేశ్ శనివారం రాత్రి ట్విటర్‌లో పెట్టారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఓ బహిరంగ సభలో నేను టీఆర్‌ఎస్ పార్టీకి ఓటు వేస్తానని చెప్పడం తనకు దిగ్ర్భాంతి కలిగించిందని ఆమె అన్నారు.

ఓటర్లను అయోమయానికి గురి చేయడానికి ఆయన తనను ఎంచుకోవడం దురదృష్టకరం, బాధాకరమని భువనేశ్వరి అన్నారు. తాను స్పష్టంగా చెబుతున్నానని తన ఓటు ఎప్పటికీ టీడీపీకేనని ఆమె తన ఖండనలో స్పష్టం చేశారు
Rejoinder from my mom on KCR's statement. "I am appalled by the way CM of a state lied in a public meeting that I will vote for TRS. (1/2)
— Lokesh Nara (@naralokesh) January 30, 2016 It's really unfortunate & sad that he choose to use me to confuse the voters. To set the record straight my vote is always for TDP." (2/2)
— Lokesh Nara (@naralokesh) January 30, 2016 కేసీఆర్ అబద్ధాల కోరు.. ఎమ్మెల్యే జనార్ధనరావు
కేసీఆర్ వ్యాఖ్యల గురించి విశాఖలో ఉన్న చంద్రబాబుకు పార్టీ వర్గాలు చెప్పడంతో ఆయన విస్మయం వ్యక్తం చేశారు. ‘కేసీఆర్ ఎన్ని అబద్ధాలు ఆడతారో మరోసారి రుజువైంది. రాష్ట్రంలో రాజకీయంగా ఎన్నో పోరాటాలు జరిగినా చంద్రబాబు సతీమణి గురించి బహిరంగ సభలో మాట్లాడిన వాళ్ళు లేరు. కేసీఆర్ చివరకు ఆమెను కూడా వదల్లేదు. ఆయన నైజం మరోసారి రుజువైంది' అని టీడీపీ ఎమ్మెల్సీ టీడీ జనార్ధనరావు వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications