MLC Kavithaకు బిగ్ షాక్: మళ్ళీ కస్టడీ పొడిగింపు.. ఎప్పటివరకంటే
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బయటపడే పరిస్థితి కనిపించడం లేదు. తాజాగా మరోమారు కవితకు ఊహించని షాక్ తగిలింది. కవిత కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు తీర్పు ఇచ్చింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసిన నాటి నుండి ఇప్పటివరకు కవితకు అన్నీ ప్రతికూల తీర్పులే వస్తున్నాయి.
కవితకు ఆది నుండీ ప్రతికూలతలే
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కవితను అరెస్ట్ చేసిన ఈడీ ఆమెను కోర్టు ముందు హాజరు పరిచి ఆమెను తీహార్ జైలుకు పంపిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కవితను ఈడీ అధికారులు విచారించారు. అప్పటినుంచి ఇప్పటివరకు ఈ కేసు నుంచి బయటపడటం కోసం కవిత చేయని ప్రయత్నం లేదు. మొదట ఈ డి అరెస్టు చేయడాన్ని తప్పు పట్టి కోర్టులో ఫైట్ చేయాలని భావించిన కవితకు కోర్టులో చుక్కెదురైంది.

కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
ఆ తర్వాత కవిత మధ్యంతర బెయిల్ కోసం, సాధారణ బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరుగా మారాయి. ఒకవైపు ఈడీ, మరొకవైపు సిబిఐ మూకుమ్మడిగా దాడి చేయడంతో కవిత ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇప్పటికే అనేకమార్లు కవిత కస్టడీని పొడిగించిన రౌస్ అవెన్యూ కోర్టు తాజాగా మరో మారు మే 20వ తేదీ వరకు కవిత జ్యూడిషియల్ కస్టడీని పొడిగించింది.
కవిత కస్టడీని పొడిగించిన కోర్టు
ఈడీ కేసులో రిమాండ్ ముగియడంతో కవితను మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తీహార్ జైలు నుంచి హాజరుపరిచారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత పాత్రపై దర్యాప్తు కొనసాగుతున్నందున ఆమె కస్టడీని పొడిగించాలని ఈడి అధికారులు కోర్టును కోరారు. ఈడీ తరపున న్యాయవాదుల వాదనతో ఏకీభవించిన కోర్టు కవిత కస్టడీని ఈనెల 20 వరకు పొడిగించింది.
కవితపై ఈడీ 8 పేజీల సప్లమెంటరీ చార్జి షీట్
మరోవైపు ఈడి దాఖలు చేసిన 8 పేజీల సప్లమెంటరీ చార్జి షీట్ ను పరిగణలోకి తీసుకునే అంశం పైన ఈనెల 20వ తేదీన విచారణ చేపడతామని జడ్జి వెల్లడించారు. ఇదిలా ఉంటే సిబీఐ కేసులో కవితకు కోర్టు ఈనెల 20 వరకు కస్టడీ విధించిన విషయం తెలిసిందే. మొత్తానికి ఎమ్మెల్సీ కవితకు మళ్లీ కోర్టులో మరో మారు ఊహించని బిగ్ షాక్ తగిలింది.
-
ఇక ఒక్క మిస్డ్ కాల్‌తో గ్యాస్ బుకింగ్: కొత్త నంబర్లు ఇవే! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..!












Click it and Unblock the Notifications