వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈటలకు రాజేందర్ కు బిగ్ షాక్.. జమునా హేచరీస్ భూముల పంపిణీకి రంగం సిద్ధం

|
Google Oneindia TeluguNews

బిజెపి ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు తెలంగాణ ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. ఈటల రాజేందర్ కు చెందిన వివాదాస్పదమైన జమున హేచరీస్ భూములకు సంబంధించి సంచలన నిర్ణయం తీసుకుంది.

బీజేపీ డిజిటల్ బోర్డు: జీహెచ్ఎంసీ షాక్.. రూ.55వేల జరిమానా విధింపు.. ట్విస్ట్ ఏంటంటే!!బీజేపీ డిజిటల్ బోర్డు: జీహెచ్ఎంసీ షాక్.. రూ.55వేల జరిమానా విధింపు.. ట్విస్ట్ ఏంటంటే!!

 ఈటల చేతిలో ఉన్న భూములను లబ్ధిదారులకు తిరిగి ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం

ఈటల చేతిలో ఉన్న భూములను లబ్ధిదారులకు తిరిగి ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం


మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేటలో జమున హేచరీస్ కు చెందిన భూముల వ్యవహారాన్ని తేల్చే పనిలో పడిన అధికారులు ఈటల కు సంబంధించిన భూములను రైతులకు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారులతో కలెక్టర్ కూడా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. జమున హేచరీస్ సంస్థ దళితుల నుండి అసైన్డ్ భూములు కొనుగోలు చేసిందని గతంలోనే జిల్లా కలెక్టర్ నిర్ధారించారు. దీంతో ఈటల చేతిలో ఉన్న భూములను లబ్ధిదారులకు తిరిగి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అసైన్డ్ లబ్ధిదారులుగా ఉన్న 56మంది దళితులకు జమునా హేచరీస్ భూముల పంపిణీ

అసైన్డ్ లబ్ధిదారులుగా ఉన్న 56మంది దళితులకు జమునా హేచరీస్ భూముల పంపిణీ


ఈ క్రమంలోనే జమున హేచరీస్ భూములను అసైన్డ్ లబ్ధిదారులుగా ఉన్న 56మంది దళితులకు పంపిణీ చేయనుంది. హుజురాబాద్ ఉప ఎన్నికలలో ఈటల రాజేందర్ ను ఓడించాలని శతవిధాల ప్రయత్నం చేసినా టిఆర్ఎస్ సర్కార్ విఫలమైంది. ఈటల రాజేందర్ ఎమ్మెల్యేగా గెలుపొంది సత్తా చాటారు. ఇక ఈటల రాజేందర్ పై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలకు ముందు జమున హేచరీస్ కు సంబంధించిన భూములను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

జమునా హేచరీస్ భూముల విషయంలో ఈటల బర్తరఫ్ .. బీజేపీలో చేరిక

జమునా హేచరీస్ భూముల విషయంలో ఈటల బర్తరఫ్ .. బీజేపీలో చేరిక


ఇదిలా ఉంటే మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట లో జమునా హేచరీస్ దళితుల నుండి భూములను కొనుగోలు చేసింది. అయితే ఈ భూముల విషయంలో ఈటల రాజేందర్ పై అక్రమంగా అసైన్డ్ భూములు కొనుగోలు చేశారంటూ కేసు నమోదైంది. ఇక ఇదే వ్యవహారంలో గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ ను సీఎం కేసీఆర్ మంత్రివర్గం నుంచి అత్యంత అవమానకర రీతిలో బర్తరఫ్ చేశారు. ఆ తర్వాత ఈటల రాజేందర్ టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బిజెపి తీర్థం తీసుకున్నారు.

70.33ఎకరాల భూమి 56 మంది రైతులకు పంచనున్న తెలంగాణా సర్కార్

70.33ఎకరాల భూమి 56 మంది రైతులకు పంచనున్న తెలంగాణా సర్కార్


ఇక సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే ఈటల రాజేందర్ ను మరింత ఇరకాటంలో పెట్టడానికి జమున హేచరీస్ భూములపై విచారణ జరిపించి నివేదిక ఆధారంగా భూములను పంచాలని నిర్ణయం తీసుకున్నారు. 56మంది రైతులకు సంబంధించి మొత్తం 70.33 ఎకరాల భూమి కబ్జా అయినట్టు పేర్కొని దానిని పంచాలని నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెల 2,3 తేదీలలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ వేదికగా జరగనున్నాయి. ఈ సమయంలో ఈటలకు షాక్ ఇస్తుంది గులాబీ సర్కార్.

English summary
Big Shock to Etela Rajender. Officials prepared the sector for the distribution of Jamuna Hatcheries lands. BJP leader Etela was concerned over the decision taken by the TRS government ahead of the BJP national executive meetings
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X