Bigg Boss 5 Telugu: అతి తక్కువ ఓట్లను దక్కించుకున్నా..హౌస్‌లో కంటిన్యూ: షాకింగ్ ఎలిమినేషన్
హైదరాబాద్: టాలీవుడ్ అందగాడు అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న వరల్డ్ బిగ్గెస్ట్ టెలివిజన్ రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5లో ఇవ్వాళ మరో కంటెస్టెంట్ ఎలిమినేట్ కానున్నారు. మరొకరు బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటికి వెళ్లిపోనున్నారు. ఇప్పటికే తొమ్మిది ఎలిమినేట్ అయ్యారు. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటిదాకా సరయు, ఉమాదేవి, లహరి షారీ, నటరాజ్ మాస్టర్, హమీదా ఖాతూన్, శ్వేతా వర్మ, ప్రియ, లోబో, విశ్వ ఎలిమినేట్ అయ్యారు.

ఎలిమినేషన్ లిస్ట్‌లో ఉన్నది వీరే..
ఈ వారం అయిదుమంది యాంకర్ రవి, సిరి హన్మంతు, సన్నీ, ఆర్జే కాజల్, మానస్ నాగులపల్లి ఎలిమినేషన్ కోసం నామినేట్ అయ్యారు. వారిలో సన్నీ ఒక్కడే సేఫ్ అయ్యాడు. మిగిలిన నలుగురూ డేంజర్‌జోన్‌లోనే ఉన్నారు. ప్రస్తుతం హౌస్‌లో తొమ్మిదిమంది ఉండగా.. జశ్వంత్ పడాల అలియాస్ జెస్సీ సీక్రెట్ రూమ్‌లో ఉంటోన్న విషయం తెలిసిందే. హెల్త్ చెకప్ చేయించుకుని వచ్చిన అతను సీక్రెట్ రూమ్‌లో ఉంటోన్నాడు. శనివారం రాత్రి నాటి ఎపిసోడ్‌లో ఇద్దరు డాక్టర్లు జెస్సీని కలిసి, అతని ఆరోగ్య వివరాలను తెలుసుకున్నారు.

నామినేషన్స్‌లో లేకపోయినా..
ఈ వారం నామినేషన్స్‌లో మిగిలివున్న నలుగురు కూడా సేఫ్ కానున్నారు. వారికి బదులుగా జెస్సీ ఈ వారం బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ కానున్నాడు. అతనికి మరిన్ని హెల్త్ చెకప్స్ నిర్వహించాల్సి ఉందంటూ డాక్టర్లు తెలిపారు. సీక్రెట్ రూమ్‌లో జెస్సీతో మాట్లాడి అతని ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్న డాక్టర్లు మరిన్ని డయాగ్నసిస్‌లను నిర్వహించాల్సి ఉంటుందని చెప్పడంతోనే.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరో దాదాపుగా ఖరారైంది.

డిఫరెంట్ ఎలిమినేషన్..
ఈ వారం ఎలిమినేషన్ కాస్త భిన్నంగా ఉండనుంది. బిగ్‌బాస్ హౌస్‌లోని కంటెస్టెంట్లు ఎవరూ ఈ సారి బయటికి వెళ్లట్లేదు. నామినేట్ అయిన వాళ్లందరూ సేఫ్ కానున్నారు. హౌస్‌లో కంటిన్యూ అవుతారు. ఇదివరకు గంగవ్వ ఏ రకంగా ఎలిమినేట్ అయ్యారో.. అదే తరహా ఎలిమినేషన్ ప్రక్రియ ఈ వారం ఉండబోతోంది. బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లకు బదులుగా ఆరోగ్య కారణాలతో జెస్సీ ఈ వారం ఎలిమినేట్ కానున్నారు. నామినేషన్స్‌లో లేనప్పటికీ.. మరిన్ని హెల్త్ చెకప్స్‌ను నిర్వహించాల్సి ఉన్నందున అతను బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటికి వెళ్లనున్నాడు.

డబుల్ ఎలిమినేష్ అనుకున్నా..
ఆరోగ్య కారణాల వల్ల జెస్సీతో పాటు నామినేషన్ లిస్ట్‌లో ఉన్న నలుగురిలో ఒకరిని ఎలిమినేషన్ చేయొచ్చనే అంచనాలు వ్యక్తం అయ్యాయి. డబుల్ ఎలిమినేషన్ కింద అతి తక్కువ ఓట్లను సాధించిన కంటెస్టెంట్‌ను బయటికి పంపిస్తారని, డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చని తొలుత భావించారు. ఆ అంచనాలు తలకిందలయ్యాయి. డబుల్ ఎలిమినేషన్ ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఫలితంగా- ఈ వారం ఎలిమినేషన్ కోసం నామినేట్ అయిన కంటెస్టెంట్లందరూ సేఫ్.

తక్కువ ఓట్లను సాధించింది ఎవరంటే..
ఈ వారం అతి తక్కువ ఓట్లను సాధించిన కంటెస్టెంట్.. ఆర్జే కాజల్. నిజానికి ఆమే హౌస్ నుంచి బయటికి వెళ్లాల్సి ఉంది. నామినేషన్ లిస్ట్‌లో ఉన్న మిగిలిన కంటెస్టెంట్లతో కంపేర్ చేస్తే.. అతి తక్కువ ఓట్లు కాజల్‌కు పోల్ అయ్యాయి. యంకర్ రవికి అత్యధికంగా 25 శాతం ఓట్లు పడ్డాయి. సిరి హన్మంతు-21, సన్నీ-29, మానస్ నాగులపల్లి-15, కాజల్-10 శాతం మంది వీక్షకులు ఓటు వేసి, వారికి మద్దతుగా నిలిచారు. సన్నీ ఇప్పటికే సేవ్ అయ్యాడు. మిగిలిన నలుగురు అన్‌సేఫ్‌లో ఉన్నారు. వారిలో కాజల్ ఎలిమినేట్ కావాల్సి ఉన్నప్పటికీ.. ఆమెకు బదులుగా నామినేషన్స్‌లో లేని జెస్సీ.. బయటికి వెళ్లనున్నాడు.












Click it and Unblock the Notifications