Bigg Boss 5 Telugu: 3 వారాల్లో ఇంటికొచ్చేస్తానంటూ కూతురికి ప్రామిస్: అంతలోనే ఎలిమినేట్

హైదరాబాద్: అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న వరల్డ్ బిగ్గెస్ట్ టెలివిజన్ రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 ఇక ముగింపుదశకు వచ్చేసింది. ఇంకో మూడు వారాలు మిగిలి ఉన్నాయి. అటు బిగ్‌బాస్ హౌస్‌లోనూ ఈ టైటిల్ కోసం పోటీ పడుతోన్న కంటెస్టెంట్ల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఈ వారం మరొకరు బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటికి వెళ్లిపోనున్నారు. ఇప్పటికే 11 మంది ఎలిమినేట్ అయ్యారు. ఈ వారం ఎలిమినేషన్ దెబ్బ ఎవరి మీద పడుతుందనేది హాట్ టాపిక్‌గా మారింది.

 ఇప్పటిదాకా..

ఇప్పటిదాకా..

ఇప్పటిదాకా సరయు, ఉమాదేవి, లహరి షారీ, నటరాజ్ మాస్టర్, హమీదా ఖాతూన్, శ్వేతా వర్మ, ప్రియ, లోబో, విశ్వ ఎలిమినేట్ అయ్యారు. ఆరోగ్య కారణాలతో జెస్సీ అలియాస్ జస్వంత్ పడాల బిగ్‌బాస్ హౌస్‌ను వీడాల్సి వచ్చింది. కిందటి వారం యానీ మాస్టర్ ఎలిమినేషన్‌ను ఎదుర్కొన్నారు. ఇక ఈ వారం మరో కంటెస్టెంట్ హౌస్‌ను వీడనున్నాడు. తన ఇంటికి వెళ్లనున్నాడు. 19 మందితో మొదలైన ఈ రియాలిటీ షోలో ఇప్పుడు మిగిలింది ఎనిమిది మందే. వారిలోనూ ఆదివారం రాత్రి మరొకరు ఎలిమినేట్ కానున్నారు.

ఆ ఒక్కడు తప్ప..

ఆ ఒక్కడు తప్ప..

ఈ వారం ఏడు మంది ఎలిమినేషన్ కోసం నామినేట్ అయ్యారు. మానస్ నాగులపల్లి తప్ప మిగిలిన వారందరూ నామినేట్ అయ్యారు. ప్రియాంక సింగ్ అలియాస్ పింకీ, సిరి హన్మంతు, షణ్ముఖ్ జశ్వంత్, ఆర్జే కాజల్, వీజే సన్నీ, ప్లేబ్యాక్ సింగర్ శ్రీరామచంద్ర, యాంకర్ రవి నామినేట్ అయ్యారు. వారిలో కనీసం ఇద్దరు శనివారం రాత్రి నాటి ఎపిసోడ్ సందర్భంగా సేఫ్ అవుతారు. ఆ ఇద్దరు అదృష్టవంతులు ఎవరనేది ఇంకాస్సేపట్లో తేలిపోతుంది. కనీసం అయిదుమంది డేంజర్‌జోన్‌లో కొనసాగే అవకాశం ఉంది.

ఈ వారం ఎలిమినేట్ అయ్యేది..

ఈ వారం ఎలిమినేట్ అయ్యేది..

ఈ వారం ఎలిమినేట్ అయ్యేది యాంకర్ రవి అని తెలుస్తోంది. ఈ దఫా అతని పెర్‌ఫార్మెన్స్ అంచనాలకు అందని విధంగా సాగిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. టాస్కుల్లో తన స్థాయిలో సత్తా చాటకపోయాడని అంటున్నారు. ఇంతకుముందు- రవిలో కనిపించిన ఫైర్, స్పార్క్ క్రమంగా తగ్గుతూ వచ్చిందని, ఆ పూర్ పెర్‌ఫార్మెన్స్ వల్ల బిగ్ బాస్ టైటిల్ కంటెస్టెంట్ రేస్ నుంచి తప్పుకోక తప్పని పరిస్థితిని ఎదుర్కొంటోన్నాడని సమాచారం.

గుంటనక్కగా..

గుంటనక్కగా..


యాంకర్ రవికి బిగ్‌బాస్ హౌస్‌లో ఎన్నో నిక్ నేమ్స్ వచ్చాయి. వాటి మీద జోక్స్ పడ్డాయి. సోషల్ మీడియాల మెమెస్ సైతం క్రియేట్ అయ్యాయి. సీజన్ మొదట్లోనే అతనికి గుంటనక్క అనే ముద్ర పడింది. అందులో నుంచి బయటపడలేకపోయాడు యాంకర్ రవి. నటరాజ్ మాస్టర్ ఏ ముహూర్తంలో గుంటనక్క అనే పేరు పెట్టాడో గానీ.. అది అతన్ని 12వ వారం వరకూ వెంటాడుతూనే వచ్చింది. హోస్ట్ అక్కినేని నాగార్జున కూడా రవిని గుంటనక్కగా సంబోధించిన ఎపిసోడ్స్ చాలానే ఉన్నాయి.

 ఇన్‌ఫ్లూయెన్స్ స్టార్‌గా..

ఇన్‌ఫ్లూయెన్స్ స్టార్‌గా..

ఇన్‌ఫ్లూయెన్స్ స్టార్‌గా కూడా పిలిపించుకుంటుంటాడు యాంకర్ రవి. తోటి వారిని తన మాటల మాయాజాలంలో పడేసి, ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుంటాడనే పేరును తెచ్చుకున్నాడు. వారిని అలా ఇన్‌ఫ్లూయెన్స్ చేసి, తాను మాత్రం తన గేమ్‌ను సేఫ్‌గా ఆడుతుంటాడని తోటి కంటెస్టెంట్లు బాహటంగానే చాలాసార్లు ప్రస్తావించారు. అక్కినేని నాగార్జున కూడా దీనికి మినహాయింపేమీ కాదు. అలాంటి ఇన్‌ఫ్లూయెన్స్ స్టార్.. మరి ఎవరి ఇన్‌ఫ్లూయెన్స్‌కు గురయ్యాడో గానీ.. ఆ వారం బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ కానున్నట్లు చెబుతున్నారు.

మూడు వారాల్లో ఇంటికొచ్చేస్తానంటూ..

మూడు వారాల్లో ఇంటికొచ్చేస్తానంటూ..

బిగ్‌బాస్.. ఈ వారం కంటెస్టెంట్లందరికీ తమ కుటుంబ సభ్యులను కలుసుకునే అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా.. యాంకర్ రవి భార్య నిత్య, కుమార్తె వియా అతన్ని కలుసుకున్నారు. ఒకవంక భర్తగా..మరోవంక తండ్రిగా యాంకర్ రవి భావోద్వేగానికి గురైన సందర్భాన్ని చూసి తీరాల్సిందే. ఇక మూడు వారాలే ఉందని, తాను ఇంటికి వచ్చేస్తానంటూ వియాకు ప్రామిస్ చేశాడు రవి. అనూహ్యంగా- కుటుంబ సభ్యులను కలుసుకున్న తొలి వారమే అతను ఎవిక్ట్ కానున్నట్లు సమాచారం.

టఫ్ కాంపిటిటర్‌గా..

టఫ్ కాంపిటిటర్‌గా..

నిజానికి- యాంకర్ రవిని టఫ్ కాంపిటిటర్‌గా భావించారు. టాప్-5లో ఉండొచ్చనే అంచనాలూ వెలువడ్డాయి. హౌస్ నుంచి వెళ్లిపోయిన తోటి కంటెస్టెంట్లు కూడా ఇదే విషయాన్ని వెలిబుచ్చారు. వారి అంచనాలన్నీ తప్పాయి. తలకిందులు అయ్యాయి. 12వ వారంలోనే అతను బిగ్‌బాస్ హౌస్‌ను వీడాల్సి వచ్చింది. ఇక టాప్ ఫైవ్‌లో ఎవరు ఉంటారనే విషయంపై అంచనాలు వేయడం మరింత కష్టతరమైనట్టే. శ్రీరామచంద్ర, వీజే సన్నీ, మానస్ నాగులపల్లి, షణ్ముఖ్ జస్వంత్, ఆర్జే కాజల్, సిరి హన్మంతు, ప్రియాంక సింగ్.. ఇలా టాప్ ఫైవ్‌లోకి ఎవరు వస్తారనేది మరింత ఆసక్తికరంగా మార్చివేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+