India
  • search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణాలో బీజేపీ దూకుడు; మళ్ళీ రంగంలోకి కేంద్ర మంత్రులు.. ఈసారి ప్లాన్ ఇదే!!

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో టిఆర్‌ఎస్‌ను గద్దె దించాలని బిజెపి దూకుడుగా ముందుకు వెళుతుంది. రోజుకో రకమైన ఎత్తులతో, వ్యూహాలతో టిఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టడానికి బిజెపి ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ పై యుద్ధం ప్రకటించిన బండి సంజయ్ ఆర్టీఐ ద్వారా వంద దరఖాస్తులు దాఖలు చేసి టిఆర్ఎస్ సర్కార్ చేపట్టిన అన్ని కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను, అవినీతి లెక్కలను పక్కా సమాచారం సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. కెసిఆర్ కు చుక్కలు చూపించాలని రంగంలోకి దిగిన బండి సంజయ్ కెసిఆర్ పై ముప్పేట దాడి మొదలుపెట్టారు.

త్వరలో తెలంగాణాలో నియోజకవర్గాలలో రంగంలోకి కేంద్ర మంత్రులు..

త్వరలో తెలంగాణాలో నియోజకవర్గాలలో రంగంలోకి కేంద్ర మంత్రులు..

అంతేకాదు రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ బైక్ ర్యాలీలు నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించారు. ఇక ఇదే సమయంలో మరో వ్యూహాన్ని కూడా త్వరలో ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా కేంద్ర మంత్రుల వరుస పర్యటనలు తెలంగాణ రాష్ట్రంలో కొనసాగనున్నాయి. రాష్ట్రంలోని లోక్‌సభ నియోజకవర్గాల్లో కేంద్రమంత్రులు పర్యటిస్తారని, ప్రతి నియోజకవర్గంలో కనీసం రెండు రాత్రులు గడుపుతారని, పగటిపూట నియోజకవర్గ నాయకులు, పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతారని తెలంగాణ బీజేపీ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.

లోక్‌సభ ప్రవాస్‌ యోజన వ్యూహంలో భాగంగా తెలంగాణాకు కేంద్ర మంత్రులు

లోక్‌సభ ప్రవాస్‌ యోజన వ్యూహంలో భాగంగా తెలంగాణాకు కేంద్ర మంత్రులు

పార్టీ 'లోక్‌సభ ప్రవాస్‌ యోజన' వ్యూహంలో భాగంగా రాష్ట్రాన్ని ఆదిలాబాద్‌, హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌, వరంగల్‌ నాలుగు క్లస్టర్లుగా విభజించినట్లు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి తెలిపారు. కేంద్ర మత్స్యశాఖ మంత్రి పర్షోత్తం ఖోడాభాయ్ రూపాలా ఆదిలాబాద్ క్లస్టర్‌కు ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తారని, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ వెంకటేష్ జోషి హైదరాబాద్ క్లస్టర్‌కు నాయకత్వం వహిస్తారని ఆయన చెప్పారు.

ఎనిమిదేళ్ళలో బీజేపీ సాధించిన ప్రగతి క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్లేలా వ్యూహం

ఎనిమిదేళ్ళలో బీజేపీ సాధించిన ప్రగతి క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్లేలా వ్యూహం


మహబూబ్‌నగర్ క్లస్టర్ బృందానికి భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్ర నాథ్ పాండే నాయకత్వం వహిస్తుండగా, ఈశాన్య ప్రాంత సహాయ మంత్రి బి.ఎల్. వర్మ వరంగల్ క్లస్టర్‌లో పార్టీ కార్యక్రమాలకు సారథ్యం వహించనున్నారు. గత ఎనిమిదేళ్లలో మోదీ ప్రభుత్వ హయాంలో వివిధ రంగాల్లో సాధించిన అభివృద్ధిపై కేంద్రమంత్రులు రాష్ట్రంలో ఉన్న సమయంలో చర్చిస్తారు. కేంద్ర ప్రభుత్వం చేసిన సంక్షేమాన్ని రాష్ట్రంలో ఏ విధంగా క్షేత్ర స్థాయిలోకి తీసుకువెళ్లాలి అన్నదానిపై వారు పార్టీ నేతలతో చర్చిస్తారు. తెలంగాణ రాష్ట్రంలోని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తారు.

 వరుసగా జాతీయ నేతల పర్యటనలతో ప్రజల్లోకి బీజేపీ సందేశం

వరుసగా జాతీయ నేతల పర్యటనలతో ప్రజల్లోకి బీజేపీ సందేశం

వరుసగా జాతీయ నాయకుల పర్యటనలతో, బిజెపి ఫోకస్ తెలంగాణ రాష్ట్రంపై ఉన్నట్టు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి బిజెపి కృషి చేస్తున్నట్టు ప్రజాక్షేత్రంలో చూపించే ప్రయత్నం చేస్తోంది బిజెపి అగ్రనాయకత్వం. మొత్తానికి బండి సంజయ్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో బిజెపి టిఆర్ఎస్ పార్టీ కి చెక్ పెట్టడానికి వినూత్న వ్యూహాలను అనుసరిస్తూ ముందుకు వెళుతుంది. మరి ఈ ప్రయత్నంలో ఏ మేరకు బీజేపీ సక్సెస్ అవుతుంది అనేది భవిష్యత్ లో తేలనుంది.

English summary
BJP's aggression will continue in Telangana. Again the visits of Union Ministers will continue. As part of the Lok Sabha Pravas Yojana strategy, the Union Ministers will visit Telangana and give directions to take the BJP strong at the field level.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X