ఉల్టా పల్టా.. బీజేపీ, కాంగ్రెస్ రాజకీయం!!
తెలంగాణ రాష్ట్రంలో రానున్న ఎన్నికల నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతుంది. అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని గద్దె దించడం కోసం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటీ పడుతున్నాయి. అయితే బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ మేమేనని మొన్నటి వరకు బలంగా చెప్పిన బిజెపి, తాజా రాజకీయ పరిణామాలతో డైలమాలో పడుతోంది.
ఇక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మనుగడే ప్రశ్నార్థకం అని భావించిన వేళ తాజా పరిణామాలు కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్సాహానికి అద్దం పడుతున్నాయి.తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ల రాజకీయం రివర్స్ అయ్యింది. తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికలు కొనసాగిన సమయంలో దుబ్బాక, హుజురాబాద్ లో గెలిచి, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సత్తా చూపించి, బీజేపీ దూకుడును కొనసాగించింది.

దీంతో తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా బీజేపీ ఎదిగిందని అందరూ భావించారు. అయితే తాజా పరిణామాలు బిజెపిని ఇబ్బంది పెడుతున్నాయి. ఇటీవల కాలంలో బీజేపీ లో చోటుచేసుకున్న అంతర్గత పోరు, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మార్పు అంశం, పలువురు బీజేపీ ముఖ్య నాయకుడు పార్టీని వీడుతారని జరుగుతున్న ప్రచారం వెరసి బిజెపి ఇంతకాలం సంపాదించుకున్న ఇమేజ్ మసకబారుతుంది.
ఇప్పుడు బిజెపి ఒక సందిగ్ధావస్థలో ఉంది. ఇక తాజా పరిణామాలతో నేతల దూకుడు కాస్త తగ్గింది. తెలంగాణ లో ఏం చేసినా మళ్లీ పైకి వచ్చే అవకాశమే లేదని భావించిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో కొద్దికొద్దిగా పుంజుకుంటుంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు వంటి ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీ బాట పట్టడం కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చింది.
తెలంగాణలో ఉనికే లేదని భావించిన కాంగ్రెస్ పార్టీ, ఇటీవల కాలంలో పార్టీలోకి జరుగుతున్న చేరికలతో జవసత్వాలను నింపుకుంటుంది. ఇక కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ పర్యటనలు, రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న సభలు సైతం పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం కాంగ్రెస్ పార్టీ వైపు దృష్టి సారించేలా తాజా పరిణామాలు మారాయి.
బీజేపీని పక్కనపెట్టిన బీఆర్ఎస్ ఇప్పుడు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏదేమైనా ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో తెలంగాణ రాష్ట్రంలో తలకిందులుగా రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. పార్టీల పరిస్థితులలో కూడా మార్పు వస్తుంది. ఇక ఇప్పుడు తాజా పరిణామాలతో బీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయం ఎవరు అన్నది? ఆసక్తికర చర్చ జరుగుతోంది.
-
చిరంజీవి మార్గమా? పవన్ వ్యూహమా? విజయ్ ముందున్న అసలు సవాల్ ఇదే! -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే?












Click it and Unblock the Notifications