వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్ తప్పు చేశారు, చాలామందిలో నిజాం లక్షణాలు: బిజెపి, టిడిపి ధర్నా (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అధికార టిఆర్ఎస్ పార్టీ పైన, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన బిజెపి తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ గురువారం మండిపడ్డారు. బిజెపి కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవం అనంతరం వారు మాట్లాడారు.

రజాకారుల అరాచకాలకు 5వేల మంది బలయ్యారని కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నేటి తరానికి నాటి చరిత్ర తెలియకపోవడం దారుణమన్నారు. మజ్లిస్ బాధపడుతుందనే ముఖ్యమంత్రి కెసిఆర్ విమోచన దినంకు దూరంగా ఉన్నారని విమర్శించారు. సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం దారుణమన్నారు.

విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకుండా తెలంగాణ సర్కార్ తప్పు చేసిందని దత్తాత్రేయ అభిప్రాయపడ్డారు. నిజాం లక్షణాలు ఉన్నవారు ఇంకా దేశంలో చాలామంది ఉన్నారన్నారు. తాము అధికారంలోకి వచ్చాక విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామన్నారు.

మరోవైపు, బుధవారం నాడు ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలు గన్ పార్క్ వద్ద ఆందోళన నిర్వహించారు. వారికి తెలుగు మహిళలు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎర్రబెల్లి దయాకర రావు, రావుల చంద్రశేఖర రెడ్డి, రేవంత్ రెడ్డి, ఎల్ రమణ తదితరులు మద్దతు పలికారు.

కిషన్ రెడ్డి, దత్తాత్రేయ

కిషన్ రెడ్డి, దత్తాత్రేయ

బిజెపి కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవం ఘనంగా జరిగింది. కేంద్రమంత్రులు బండారు దత్తాత్రేయ, హన్స్‌రాజ్‌, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

రైతుల కోసం టిడిపి ధర్నా

రైతుల కోసం టిడిపి ధర్నా

రైతుల పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎగతాళిగా ప్రవర్తిస్తోందని తెలంగాణ టిడిపి నేతలు బుధవారం నాడు భగ్గుమన్నారు.

రైతుల కోసం టిడిపి ధర్నా

రైతుల కోసం టిడిపి ధర్నా

అనారోగ్యంతో చనిపోయాడని హైదరాబాదులోని ట్యాంక్ బండు పైన చనిపోయిన లింబయ్య మృతి పట్ల అవహేళనగా మాట్లాడారని మండిపడ్డారు.

రైతుల కోసం టిడిపి ధర్నా

రైతుల కోసం టిడిపి ధర్నా

తెలుగు మహిళలు, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలు బుధవారం హైదరాబాదులో ఆందోళన నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు ఎర్రబెల్లి, రావుల తదితరులు పాల్గొన్నారు.

రైతుల కోసం టిడిపి ధర్నా

రైతుల కోసం టిడిపి ధర్నా

బాధిత రైతు కుటుంబాలతో కలిసి ధర్నా చేసిన టిడిపి నేతలు తెరాస ప్రభుత్వం పైన తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు.

English summary
BJP demands official fete on Telangana liberation Day
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X