లెఫ్ట్ హత్యలపై బీజేపీ ధర్నా
హైదరాబాద్: దేశవ్యాప్తంగా కమ్యూనిస్టుల ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని, వారి కారణంగానే కేరళ రాష్ట్రంలో రాజకీయ హత్యలు అత్యధికమవుతున్నాయని బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు,ఎమ్మెల్యే డాక్టర్ కే లక్ష్మణ్ ఆరోపించారు. కేరళ రాష్ట్రాన్ని రాజకీయ హత్యలకు నిలయంగా మార్చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. కేరళలో బీజేపీ కార్యకర్తల పై సీపీఎం కమ్యూనిస్టుల దాడులను నిరసిస్తూ బీజేపీ పార్టీ గ్రేటర్ అధ్యక్షుడు వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద సోమవారం నిరసన తెలిపారు.












Click it and Unblock the Notifications