బీజేపీ ఎన్నికల కమిటీల ప్రకటన.. 14 కమిటీలలో దిగ్గజనేతలు; విజయశాంతికి కీలకపదవి!!
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ వస్తుందని రాజకీయ పార్టీలన్నీ ఇప్పటికే సన్నద్ధమయ్యాయి. ఈ ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలకు కీలకమైన ఎన్నికలు కావడంతో ఎవరికివారు వ్యూహాత్మక ఎత్తుగడలతో ప్రజాక్షేత్రంలోకి వెళుతున్నారు. మూడవసారి అధికారాన్ని చేజిక్కించుకుని పరిపాలన సాగించాలని బీఆర్ఎస్, బి ఆర్ ఎస్ ను గద్దె దించి కారం హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్, తెలంగాణలో కమలం వికసించేలా చేసి, కాషాయ జెండాను రెపరెపలాడి బిజెపి ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.
ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు వచ్చే ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేస్తున్నాయి. వచ్చే ఎన్నికలకు దూకుడుగా వెళ్లాలని భావిస్తున్న బీజేపీ ఈ మేరకు ఎన్నికల కమిటీలను ప్రకటించింది. 14 ఎన్నికల కమిటీలను నియామకం చేసిన బిజెపి కమిటీలలో దిగ్గజ నేతలకు పగ్గాలు అప్పగించింది.

మేనిఫెస్టో అండ్ పబ్లిసిటీ కమిటీ చైర్మన్ గా వివేక్ వెంకటస్వామిని, కన్వీనర్ గా మహేశ్వర్ రెడ్డి, జాయింట్ కన్వీనర్ గా కొండా విశ్వేశ్వర్ రెడ్డి ని, స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని నియమించింది. ఇక పబ్లిక్ మీటింగ్స్ కు ఇన్చార్జిగా బండి సంజయ్ ను, చార్జిషీట్ కమిటీ చైర్మన్ గా మురళీధర్ రావు ను, అజిటేషన్ కమిటీ చైర్మన్ గా విజయశాంతి ని నియమించింది.
సోషల్ ఔట్ రీచ్ కమిటీ చైర్మన్ గా కోవ లక్ష్మణ్, ఇన్ఫ్లుయెన్సర్ ఔట్ రీచ్ కమిటీ చైర్మన్ గా డీకే అరుణ, సోషల్ మీడియా చైర్మన్ గా ఎంపీ అరవింద్, ఎలక్షన్ కమిషన్ ఇష్యూల కమిటీ చైర్మన్ గా మర్రి శశిధర్ రెడ్డి, హెడ్ క్వార్టర్స్ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ గా నల్లు ఇంద్రసేనారెడ్డి, మీడియా కమిటీ చైర్మన్ గా రఘునందన్ రావును నియమించింది.
క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ గా వదిరే శ్రీరామ్, ఎస్సీ నియోజకవర్గాల కమిటీ చైర్మన్ గా జితేందర్ రెడ్డి, ఎస్టి నియోజకవర్గాల కమిటీ చైర్మన్ గా గరికపాటి మోహన్ రావును తెలంగాణ బిజెపి నియమించింది. మొత్తం 14 కమిటీలను ఏర్పాటు చేసిన బిజెపి ఈ మేరకు అధికారికంగా కమిటీలను ప్రకటించింది.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications