Bandi Sanjay: వైరల్ వీడియోపై బీజేపీ క్లారిటీ.. అస్సలు ఏం జరిగిందంటే..!
గ్రూప్ -1 వాయిదా వేయాలని.. జీవో నంబర్ 29ని రద్దు చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం గ్రూప్-1 మెయిన్స్ నిర్వహిస్తామని చెబుతోంది. దీంతో అభ్యర్థులు ఆందోళనకు దిగుతున్నారు. వీరికి బీఆర్ఎస్, బీజేపీ మద్దతుగా నిలుస్తున్నాయి. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి గ్రూప్-1 అభ్యర్థులకు అండగా నిలిచారు. వారికి మద్దతుగా నిరసన తెలిపారు. గ్రూప్-1 అభ్యర్థులను కలిసిన బండి.. అక్కడి నుంచి సచివాలయానికి వెళ్లాలనుకున్నారు. ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు.
అనంతరం అభ్యర్థులతో పాటు సెక్రటేరియట్ వెళ్తున్న క్రమంలో మంత్రిని పోలీసులు అడ్డుకున్నారు. ఆయన్ను బీజేపీ ఆఫీస్ కు తరలించారు. బండి సంజయ్ అడ్డుకున్న క్రమంలో సంజయ్ కారు లోకి గుంజు, కారులోకి గుంజు అంటున్న వీడియో బీఆర్ఎస్ వాళ్లు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అయితే కారులోకి గుంజకు అని బండి సంజయ్ అన్నట్లు బీజేపీ వాళ్లు చెబుతున్నారు. బండి సంజయ్ వ్యాఖ్యలను బీఆర్ఎస్ వాళ్లు వక్రీకరించి.. దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ నేతలు ఏసీ రూమ్ ల్లో ఉంటూ బయటకు వచ్చి కొట్లాడే వారిపై అసత్య ప్రచారం చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గ్రూప్స్ అభ్యర్థులు చేస్తున్న న్యాయ పోరాటాన్ని పక్క దారి పట్టేలా బీఆర్ఎస్ ప్రయత్నిస్తుందని విమర్శించారు. తనను గుంజకు అని చెప్తే, కారులోకి గుంజమని ఆయనే చెప్పారని గలాబీ శ్రేణులు ప్రచారం చేయడం దారుణమన్నారు. రహస్య స్నేహితుడు కాంగ్రెస్‌ను రక్షించడానికి రంగంలోకి దిగి అశోక్‌నగర్‌లో ఆడిన మీ దొంగ నాటకాలను లైవ్‌లో కెమెరాల సాక్షిగా దేశమంతా చూసిందన బీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చింది. కాగా గ్రూప్-1 మెయిన్స్ నిర్వహించి తీరుతామని ప్రభుత్వం చెబుతోంది.
జీవో నంబర్ 29 తో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు నష్టం వాటిల్లుందని అభ్యర్థులు ఎంత మొత్తుకున్న ప్రభుత్వం ముందుకెళ్లడం దారుణమని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బహుజనులను మోసం చేస్తుందని అన్నారు. జీవో నంబర్ 29 రద్దు చేస్తే న్యాయపరమైన సమ్యలు వస్తాయని ప్రభుత్వం వారు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications