BJP: హంగ్ వస్తే రాష్ట్రపాతి పాలనే.. ఎవరికీ మద్దతు లేదన్న బీజేపీ..
తెలంగాణలో గురువారం పోలింగ్ ముగిసింది. సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. ఎగ్జిట్ పోల్స్ మెజారిటీ సర్వేలు కాంగ్రెస్ అధికారం ఏర్పాటు చేస్తుందని అంచనా వేయగా.. కొన్ని సర్వేలు హంగ్ వస్తుందని అంచనా వేశాయి. అయితే తెలంగాణలో హంగ్ వస్తే ఎంఐఎం, బీజేపీ కింగ్ మేకర్ మారే అవకాశం ఉంది. తెలంగాణలో హంగ్ వస్తే ఏ పార్టీకి మద్దతు ఇవ్వమని బీజేపీ ముఖ్య నేతలు తేల్చి చెబుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో జరిగిన పోలింగ్ లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చే అవకాశం లేదని.. హంగ్ వచ్చే అవకాశమే ఎక్కువగా ఉందని బీజేపీ అంచనా వేస్తోంది. ఒకవేళ రాష్ట్రంలో హంగ్ వస్తే ఏ పార్టీకి మద్దతు ఇవ్వకూడదని బీజేపీ పార్టీ అదిష్ఠానం నిర్ణయించినట్లు సమాచారం. తమకు 15 నుంచి 20 సీట్లు వస్తాయని బీజేపీ నాయకులు భావిస్తున్నారు.

ఈ ఎన్నికల్లో బీజేపీ 111 స్థానాల్లో పోటీ చేసింది. మిగతా స్థానాలు పోత్తులో భాగంగా జనసేనకు 8 స్థానాలను కేటాయించిన సంగతి తెలిసిందే. తెలంగాణలో హంగ్ వస్తే.. రాష్ట్రపతి పాలన ఏర్పడితుందని.. అప్పుడు తమకే అడ్వాంటేజ్ గా ఉంటుందని భావిస్తోంది. అంతేకాకుండా వచ్చే పార్లమెంటు ఎన్నికలకు ఇది ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు.
ఈ మధ్య ఘట్ కేసర్ లో జరిగిన బీజేపీ ఇంటర్నల్ మీటింగ్ లో బిజేపీ నేషనల్ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రెటరీ బిఎల్ సంతోష్ సైతం రాష్ట్రంలో హాంగ్ వచ్చే అవకాశం ఉందని చెప్పారు. హంగ్ వస్తే... ప్రభుత్వం ఏర్పాటు కోసం ఆయా పార్టీలోని ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకునే ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో ఏక్ నాథ్ సిండే ఏపిసొడ్ ను ఆ పార్టీ నేతలు ఇంటర్ననల్ గా గుర్తు చేస్తున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ లో కూడా ఏక్ నాథ్ సిండే ఉండొచ్చు కదా అని బీజేపీ నేతలు గుసుగుసలాడుతున్నారు.












Click it and Unblock the Notifications