ఇలా అయితే కష్టం: బండి సంజయ్ పై హైకమాండ్ సీరియస్; మధ్యలోనే వెళ్ళిపోయిన బండి?
ఒకపక్క కాంగ్రెస్ పార్టీ ప్రజా క్షేత్రంలో దూసుకుపోయేందుకు ప్రయత్నాలు సాగిస్తూ, పార్టీ నేతలు అందరిని ఏకతాటి మీదకు తీసుకు వస్తుంటే, బిజెపిలో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. బిజెపి నేతల మధ్య ఉన్న అంతర్గత కలహాలు తాజాగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలతో మరోమారు హాట్ టాపిక్ గా మారాయి.
తనపైన పనిగట్టుకుని ఫిర్యాదులు చేశారని, తన పదవి పోయేలా చేశారని సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరినీ నోరెళ్ళబెట్టేలా చేశాయి. కిషన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తొలినాడే బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు పార్టీ శ్రేణుల్లో దుమారం రేపాయి. తాజాగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తరుణంలో బండి సంజయ్ తన ఆక్రోశాన్ని వెళ్ళగక్కాడు.

తనను పని చేసుకోనివ్వకుండా అడ్డుకున్నారని, హై కమాండ్ కు తప్పుడు ఫిర్యాదులు చేసి పదవి పోయేలా చేశారని, కనీసం కిషన్ రెడ్డి నైనా పనిచేసుకోనివ్వండి అంటూ చేసిన వ్యాఖ్యలు హైకమాండ్ దృష్టికి వెళ్లాయి. బిజెపి కోర్ కమిటీ సమావేశంలో బండి సంజయ్ పై రాష్ట్ర ఇంచార్జ్ సునీల్ బన్సల్ బండి తాజా వ్యాఖ్యల నేపథ్యంలో సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది.
పార్టీ నేతల ఫిర్యాదు తోనే తనను తొలగించారని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల పైన ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు ఎంతో సమయం లేదు. ఈ సమయంలో పార్టీ నేతల పైన ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకు వెళుతుందని సునీల్ బన్సల్ ఆయన పైన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ విధమైన ప్రణాళికలతో పార్టీ సీనియర్ నాయకులు ఉంటే తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాలేమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికలకు విజయం సాధించటమే లక్ష్యంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సునీల్ బన్సల్ సూచించారు. సునీల్ బన్సల్ బండి సంజయ్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో బండి సంజయ్ సమావేశం మధ్యలోనే వెళ్లిపోయినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications