టీఆర్ఎస్ వ్యూహంలో బీజేపి ఓ టూల్ కిట్.!వచ్చే ఎన్నికల్లో గట్టెక్కేందుకు ప్రణాళిక.!కేసీఆర్ వ్యూహం అదే.!
హైదరాబాద్ : తెలంగాణలో నడుస్తోన్న రాజకీయ పరిణామాలను నిశితంగా విశ్లేషించుకుంటే కొన్ని వాస్తవాలు అర్థమవుతాయి. తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరివర్తన తీసుకురావడానికి హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రధాన భూమిక పోషించింది. ఈ ఎన్నిక తర్వాత మిగతా పార్టీల స్పందన ఎలా ఉన్నా.,అధికార టీఆర్ఎస్ పార్టీ స్వరం మాత్రం పూర్తిగా మారిపోయింది. సంక్షేమ పథకాల ప్రకటనలు గెలుపును ప్రభావితం చేయలేవని తుది నిర్ణయానికి వచ్చిన సీఎం చంద్రశేఖర్ రావు తన భవిష్యత్ రాజకీయ మనుగడ కోసం వ్యూహాలను సమూలంగా మార్చుకున్నట్టు తెలుస్తోంది. ప్రత్యర్థి ఎవరైనా నో మ్యాటర్.. ఎదురు దాడి చేస్తే రాజకీయంగా వినూత్న గుర్తింపు లభించే అవకాశం ఉంటుందని, ఇదే సిద్దాంతం ప్రయోగాత్మకంగా అమలు చేసి ఫలితం రాబట్టాలనుకుంటున్నారు చంద్రశేఖర్ రావు. తన రాజకీయ వ్యూహంలో బీజేపీని ఒక టూల్ కిట్ గా ఫిక్స్ చేసుకుని తెలంగాణ రాజకీయాలను శాసించాలన్నది చంద్రశేఖర్ రావు ప్రణాళికగా తెలుస్తోంది.

తెలంగాణ బీజేపి.. కేసీఆర్ కు ప్రియమైన శత్రువు
ఏడున్నర సంవత్సరాల తర్వాత తెలంగాణలో చంద్రశేఖర్ రావు పాలన పట్ల వ్యతిరేక పవనాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. టీఆర్ఎస్ పట్ల జనం విసిగెత్తిపోయారు. చంద్రశేఖర్ రావు క్రెడిబిలిటీ పాతాళానికి పడిపోయింది. ముచ్చట చెప్పుడు తప్ప చంద్రశేఖర్ రావుతో అయ్యేది లేదు పొయ్యేదీ లేదన్న అభిప్రాయం జనసామాన్యంలో సర్వత్రా వినిపిస్తోంది. వరుసగా పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు యాంటీ ఇన్ కంబెన్సీ సహజం. దానికి చంద్రశేఖర్ రావు వ్యవహార శైలి కూడా తోడై ఈ సారి టీఆర్ఎస్ ఓటమి ఖాయం అన్న టాక్ క్రమంగా ఊపందుకుంటోంది. సర్వేల మీద సర్వేలు చేయించుకుని ప్రజల నాడిని ఎప్పటి కప్పుడు అంచనా వేసుకునే చంద్రశేఖర్ రావు కు ఈ విషయం తెలియంది కాదు. తనను తాను బ్రహ్మాండమైన వ్యూహకర్తగా భావించే చంద్రశేఖర్ రావు తొలిసారి ప్రొఫెషనల్ స్ట్రాటజిస్టులపై ఆధారపడుతున్నారు. తన శక్తి సరిపోదని భావించి అద్దె వ్యూహకర్తలను అరువుకు తెచ్చుకున్నారు. మొదట సునీల్ ఆ తర్వాత ప్రశాంత్ కిషోర్ లకు రెడ్ కార్పెట్ పరిచారు చంద్రశేఖర్ రావు.

తెలంగాణలో తన ప్రత్యర్థి బీజేపీ మాత్రమే.. మహా కలరింగ్ ఇస్తున్న కేసీఆర్
చంద్రశేఖర్ రావు తెలంగాణలో తన ప్రత్యర్థి బీజేపీ అన్నట్టుగా కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మహా మహా నాయకులను సైతం పూచికపుల్లతో సమానంగా ట్రీట్ చేసే చంద్రశేఖర్ రావు, బండి సంజయ్ లాంటి ఓ రాష్ట్ర నాయకుడుని తన ప్రత్యర్థిగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మిస్టర్ బండి సంజయ్ అంటూ చంద్రశేఖర్ రావు మాట్లాడిన రోజు రాజకీయ విశ్లేషకులు ఒకింత ఆశ్చర్యపోయారు. చంద్రశేఖర్ రావు నోటి వెంట బండి సంజయ్ పేరు రావడం వారిలో ఆలోచన రేకెత్తించింది. 'మిస్టర్ బండి సంజయ్' అంటూ... చంద్రశేఖర్ రావు సంబోధించడంతో బండి సంజయ్ స్థాయి పెరిగిందా... చంద్రశేఖర్ రావు స్థాయి తగ్గిందా అన్న ప్రశ్నలు వినిపించాయి. ఆ తర్వాత టీఆర్ఎస్ వరుసగా కేంద్రం పై విరుచుకుపడటం, తెలంగాణకు అన్యాయం చేస్తున్నారంటూ కేంద్రంపై విమర్శలు సంధించింది గులాబీ పార్టీ. తాజాగా బడ్జెట్ ను అడ్డం పెట్టుకుని కేంద్రం పై యుద్దం ప్రకటించినంత పని చేసారు చంద్రశేఖర్ రావు.

కేసీఆర్ కొత్త ప్రయోగశాల బీజేపి.. బీజేపితో ప్రేమయుద్దం ప్రకటించిన కేసీఆర్
ఏడు సంవత్సరాలు కేంద్రంలో బీజేపీతో అంటకాగి, కేంద్రం తెచ్చిన ప్రతి బిల్లుకు అనుకూలంగా ఓటువేసిన టీఆర్ఎస్ ఇప్పుడు తిరుగుబాటు బావుటా ఎగరేసారు చంద్రశేఖర్ రావు. ఐతే, గత ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు కూడా సరిగ్గా ఇదే వ్యూహాన్ని అమలు చేశారు. నాలుగేళ్లు బీజేపీతో స్నేహం చేసి ఐదో ఏడాది స్పెషల్ స్టేటస్ పేరుతో తిరుగుబాటు బావుటా ఎగరేశారు. ఫలితం ఏమిటో మనం చూశాం. ఆ విషయం ఇక్కడ అప్రస్తుతమైనా చరిత్ర గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ అంశం కాసేపు పక్కన పెడదాం. ఇప్పుడు తెలంగాణలో బీజేపీతో టగ్ ఆఫ్ వార్ అన్నది టీఆర్ఎస్ స్కెచ్ లో భాగమే! కానీ, ఎందుకు? బీజేపీని మ్యాగ్నిఫై చేయడం ద్వారా టీఆర్ఎస్ రాజకీయ ఎత్తుగడ ఎలా వర్కవుట్ అవుతుందన్న అంశానికి చంద్రశేఖర్ రావు అత్యద్బుతంగా సొబగులు అద్దుతున్నట్టు తెలుస్తోంది.

బీజేపిని ఎంత లేపితే అంత టీఆర్ఎస్ కు లాభం.. అదే వ్యూహాన్ని అమలు చేస్తున్న కేసీఆర్
2023 లేదా అంతకంటే ముందే తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే గెలుపు వ్యూహాన్ని రచించే బాధ్యతను చంద్రశేఖర్ రావు ఉత్కృష్టగా భావిస్తున్నారు. తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు మెజారిటీ ఓటు బ్యాంకుగా ఉన్నారు. పైగా లెఫ్టిస్ట్ భావజాలం ఇక్కడ ఎక్కువ. 70 -80 నియోజకవర్గాల్లో వీళ్లే గెలుపోటములను డిసైడ్ చేస్తారు. ఈ వర్గాలేవీ బీజేపీని ఆమోదించవు. ఇప్పుడు ఈ వర్గాల టార్గెట్ గానే టీఆర్ఎస్ పథక రచన సాగుతున్నట్టు తెలుస్తోంది. దానికి బీజేపీని టూల్ కిట్ గా చంద్రశేఖర్ రావు వాడుకుంటున్నారు. తెలంగాణలో బీజేపీ ఆల్టర్నేటివ్ గా ఎదుగుతోందన్న భ్రమ కల్పిస్తే ఈ వర్గాల్లో ఒకరకమైన ఆందోళన మొదలవుతుంది. ఆ ఆందోళనే టీఆర్ఎస్ కు వరంగా మారే అవకాశాలు లేకపోలేదు. బీజేపీని పెంచినట్టు చూపించి, దాన్ని ఆపాలంటే టీఆర్ఎస్ తో మాత్రమే సాధ్యం అన్న ఇంప్రెషన్ కోసం ఇదంతా జరుగుతున్నట్టు చంద్రశేఖర్ రావు వ్యాఖ్యల ద్వారా తెలుస్తోంది. నెక్ట్స్ ఎలక్షన్స్ లో బీజేపీని బూచిగా చూపి మరోసారి టీఆర్ఎస్ పీఠమెక్కాలని ఎత్తులు వేస్తున్నట్టు దీనిని బట్టి స్పష్టంగా అర్థమవుతోంది. తెలంగాణ సమాజమా... ఉలిక్కిపడు.!
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications