యాదాద్రిలో గులాబీ ప్రచారానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్న లక్ష్మణ్
Recommended Video
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ టిఆర్ఎస్ పార్టీని యాదాద్రి ఆలయంలో గులాబీ ప్రచారం అంశంలో టార్గెట్ చేశారు. ఇంతవరకు ఎవరూ చెయ్యని విధంగా ఆధ్యాత్మిక క్షేత్రంలో కూడా రాజకీయ రంగు పులమటం బీజేపీ నేతలకు ఏ మాత్రం నచ్చటం లేదు. దీంతో కేసీఆర్ పై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. ఇక సోషల్ మీడియా లో సైతం ఈ ఉదంతం వైరల్ గా మారింది. కేసీఆర్ అనే ఒక మహారాజు అంటూ వ్యంగ్య కథలు సర్క్యులేట్ అవుతున్నాయి. ఇక బీజేపీ ఈ అంశాన్ని బేస్ గా తీసుకుని టీఆర్ ఎస్ ను ఇరకాటంలో పెట్టాలని ప్రయత్నం చేస్తుంది.ఇక అందులో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ టీఆర్ఎస్ పార్టీపై విరుచుకుపడుతున్నారు.
కల్వకుంట్ల కుటుంబ ఆగడాలు శృతి మించాయని మండిపడిన లక్ష్మణ్ యాదాద్రి రాతి స్తంభాలపై సీఎం కేసీఆర్‌తో పాటు కారు బొమ్మలు చెక్కడాన్నిబీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రచారానికి దీనిని పరాకాష్టగా చెప్పొచ్చు అన్నారు . హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా కేసీఆర్ తీరు ఉందన్న లక్ష్మణ్ ఇలాంటి ఘటనలను సహించేది లేదని పేర్కొన్నారు. ఇక దీనికి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.

ఇప్పటికైనా చేసిన పొరపాటును ప్రభుత్వం సరిదిద్దుకోవాలన్నారు.వెంటనే యాదాద్రి ఆలయంలో కేసీఆర్, కారు , సర్కారు చిత్రాలను తొలగించాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనితో ఆలయ ప్రతిష్టకి భంగం కలుగుతుంది అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతవరకు ఎవరూ ఇలాంటి దిగజారుడు రాజకీయాలు దేవాలయాల మీద చెయ్యలేదని మండిపడ్డారు.ఇక దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు కార్యాచరణ రూపొందించే పనిలో ఉన్నారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!











Click it and Unblock the Notifications