వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీలో అరవింద్ కు ఘోర అవమానం .. ఢిల్లీ పెద్దల ఆరా .. అసలేం జరిగింది

|
Google Oneindia TeluguNews

Recommended Video

అరవింద్‌ ను అవమానించిన బీజేపీ నాయకులు | TS BJP Leaders Shouts On Nizamabad MP Dharmapuri Aravind

తెలంగాణ బిజేపిలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కు జరిగిన అవమానం ఇప్పుడు హాట్‌ టాపిక్ అయ్యింది. గతంలో పార్లమెంట్ ఎన్నికలకు ముందు సంచలనం కలిగించిన అంశం, ఇప్పుడు తెలంగాణాలో పెద్దఎత్తున చర్చనీయాంశం అవుతుంది .. ఇందూరు గల్లీ నుంచి ఢిల్లీ దాకా అందరి నోళ్లలోనూ నానుతోన్న సంచలన ఘటన ఏంటి? ఇప్పుడు ఎందుకు ఈ అంశం మళ్ళీ చర్చకు వచ్చింది అంటే ...

నేడు సీఆర్డీఏ అధికారులతో సీఎం జగన్ సమీక్షా సమావేశం ... రాజధాని ఇష్యూపై ప్రకటన చేస్తారా ?నేడు సీఆర్డీఏ అధికారులతో సీఎం జగన్ సమీక్షా సమావేశం ... రాజధాని ఇష్యూపై ప్రకటన చేస్తారా ?

నిజామాబాద్‌లో అనవసర రాజకీయాలు చేస్తున్నావు .. గెట్ అవుట్ అన్న బీజేపీ నేత

నిజామాబాద్‌లో అనవసర రాజకీయాలు చేస్తున్నావు .. గెట్ అవుట్ అన్న బీజేపీ నేత

ప్రస్తుత నిజామా బాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌కు ప్రస్తుతం బీజేపీలోనే కాదు, దేశ వ్యాప్తంగా సీఎం కేసీఆర్ తనయ కవితను ఓడించిన నేతగా మంచి గుర్తింపు ఉంది. అలాంటి ధర్మపురి అరవింద్ కు ఎన్నికల ముందు సొంత పార్టీలోనే తీవ్రంగా అవమానం జరిగిందని ప్రచారం జరుగుతుంది. బీజేపీలోని కీలక నేతలు ధర్మపురి అరవింద్ పార్టీలో బలమైన నాయకుడిగా ఎదగటం ఇబ్బందిగా ఫీల్ అయ్యి , ఎన్నికల ముందు జరిగిన పార్టీ కీలక మీటింగ్‌లో ధర్మపురి అరవింద్ ను దారుణంగా అవమానించారని సమాచారం. సరిగ్గా పార్లమెంటు ఎన్నికల ముందు. హైదరాబాద్‌లో రాష్ట్ర పార్టీ నాయకత్వం కీలక మీటింగ్‌ లో పార్టీకి రాష్ట్రంలో అత్యంత కీలకమైన నాయకుడు నిజామాబాద్‌లో అనవసర రాజకీయాలు చేస్తున్నావంటూ ధర్మపురి అరవింద్ ను గెట్ అవుట్ అన్నారని సమాచారం. ఆ మాటతో ఒక్కసారిగా తీవ్ర ఆవేదన చెందానని, తన సన్నిహితుల దగ్గర ఆవేదన వెళ్ళబోసుకున్నారు అరవింద్ .

బీజేపీలో అనేక అవమానాలు భరించిన అరవింద్ .. ఢిల్లీ పెద్దల వద్దకు చేరిన ఎన్నికల ముందు ఘటన

బీజేపీలో అనేక అవమానాలు భరించిన అరవింద్ .. ఢిల్లీ పెద్దల వద్దకు చేరిన ఎన్నికల ముందు ఘటన

నిజామాబాద్‌లో సంచలన విజయం సాధించిన ధర్మపురి అరవింద్ పై బీజేపీ జాతీయ నాయకత్వం ప్రత్యేకంగా శ్రద్ధ చూపిస్తున్న తరుణంలో ఎన్నికలకు ముందు జరిగిన సంఘటన బీజేపీ జాతీయ నాయకత్వం వద్దకు చేరిందని తెలుస్తుంది. ధర్మపురి అరవింద్ బిజేపిలో చేరిననాటి పరిస్థితికి ,ప్రస్తుత పార్టీలో ఆయన పరిస్థితికి చాలా తేడా వచ్చింది . తండ్రి ధర్మపురి శ్రీనివాస్ అధికార టిఆర్ఎస్ పార్టీలో ఉన్నా బిజేపి పైన, ప్రధాని నరేంద్రమోడిపైన, అభిమానంతో బిజేపిలో చేరిన అరవింద్ తనకు బీజేపీలో అనేక అవమానాలు ఎదురయ్యాయని చెబుతారు . కానీ తనలో ఉన్న దేశభక్తి , మోడీ నాయత్వం పట్ల అపార విశ్వాసం నన్ను బిజేపిలో అన్ని అవమానాలు భరిస్తూ కొనసాగేలా చేశాయని ఆయన చాలా సార్లు చెప్పారు . ఇక తాజాగా ఎన్నికల తర్వాత కేసీఆర్ కుమార్తె కవితను ఓడించిన నేతగా ఆయన మంచి గుర్తింపు సాధించారు. అంతే కాదు పార్లమెంట్ లో తనదైన స్థానం సంపాదించుకున్నారు.

అసలేం జరిగింది అన్న దానిపై జాతీయ నాయకుల ఆరా .. అరవింద్ అవమానాల చర్చ ఇందుకే ...

అసలేం జరిగింది అన్న దానిపై జాతీయ నాయకుల ఆరా .. అరవింద్ అవమానాల చర్చ ఇందుకే ...

తెలంగాణలో తిరుగులేని సీఎంగా ఉన్న కేసీఆర్‌‌కే షాకిచ్చేలా, ఆయన కూతురు కవితపై అరవింద్ విజయం సాధించారు. పార్లమెంట్‌‌ పోరులో ప్రతిష్టాత్మక నిజామాబాద్ విజయంతో, పార్టీకే ఊపు తెచ్చాడని భావిస్తున్న అరవింద్‌కు ఎన్నికలకు ముందు పార్టీ పరంగా మద్దతివ్వాల్సింది పోయి, అవమానించేలా పార్టీ చేసిందనే చర్చ ప్రస్తుతం జోరుగా నడుస్తోంది. ఎన్నికల ముందు జరిగిన ఈ ఘటన, ఆ నోట ఈ నోట నాని, ప్రస్తుతం ఢిల్లీ చేరింది. ఇక ఢిల్లీ పెద్దలు తెలంగాణా రాష్ట్రంలో కీలకంగా ఎదుగుతున్న ధర్మపురి అరవింద్ విషయంలో జరిగిన దానిపై పార్టీలో ఆరా తీస్తున్నారు. ఆయనను అవమానించి గెట్ అవుట్ అన్న నేత ఎవరు ? ఎందుకు అలా ప్రవర్తించారు అన్న దానిపై వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పుడు కూడా పార్టీలో రాష్ట్ర ముఖ్యులతో సంబంధం లేకుండా జాతీయ అగ్ర నాయకత్వంతో నేరుగా సంబంధాలు కొనసాగిస్తున్న అరవింద్ పై గుర్రుగా ఉన్న బీజేపీ నేతలు ఆయనకు ఏ మాత్రం ప్రాధాన్యత ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న తరుణంలో బీజేపీలో అరవింద్ కు జరుగుతున్న అవమానాలు చర్చకు వస్తున్నాయి.

English summary
The humiliation of Nizamabad MP Dharmapuri Aravind in the Telangana BJP has now become a hot topic. In the past, it was the subject of much controversy in Telangana before the parliamentary elections.The BJP's top leadership is enquiring the get out comments on mp dharmapuri aravind
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X