ఎమ్మెల్యే రాజా సింగ్‌పై కేసు నమోదు

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఇటీవల కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఓ బహిరంగ సభలో వివాదాస్పద వాఖ్యలు చేసిన గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై గోల్కొండ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

డిసెంబరు 15న కర్ణాటకలో జరిగిన ఓ బహిరంగ సభలో పాల్గొన్న రాజాసింగ్‌ చేసిన వ్యాఖ్యలు హిందూ, ముస్లింల సఖ్యతను దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొంటూ డిసెంబర్ 20న గోల్కొండకు చెందిన ఇర్ఫాన్‌ ఫిర్యాదు చేశారు.

BJP MLA Raja Singh booked for giving hate speech in Karnataka

ఈ మేరకు ఆయనపై కేసు నమోదు చేశామని గోల్కొండ ఇన్‌స్పెక్టర్‌ ఖలీల్‌పాషా తెలిపారు. ఈ కేసును కర్ణాటకకు బదిలీ చేస్తామన్నారు. కర్ణాటకలో కూడా రాజా సింగ్‌పై కేసు నమోదైనట్లు తెలిసింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Karnataka police registered a case against BJP MLA T. Raja Singh Lodh following his inflammatory speech during a rally in Yadgir district on Thursday evening.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి