Bade bhai: కేసీఆర్‌లా కావొద్దంటూ రేవంత్ రెడ్డికి రాజా సింగ్ సూచన

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 'పెద్దన్న' (బడే భాయ్) అని సంబోధించడం శుభపరిణామమని బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. అయితే రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్‌లా వ్యవహరించవద్దని సూచించారు. సోమవారం బీజేపీ కార్యాలయంలో రాజా సింగ్ మీడియాతో మాట్లాడారు.

కేంద్ర ప్రభుత్వంతో మంచి సంబంధాలు ఉంటే తెలంగాణ మరింతగా అభివృద్ధి చెందుతుందని వ్యాఖ్యానించారు. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తాను ముఖ్యమంత్రి అయిన మొదట్లో ప్రధానమంత్రి మోడీని పొగడ్తలతో ముంచెత్తారని, అయితే, ఆ తర్వాత కాలంలో కనీసం ప్రోటోకాల్ పాటించలేదని గుర్తు చేశారు రాజా సింగ్. సీఎం రేవంత్ రెడ్డి.. కేసీఆర్ మార్గంలో నడువవద్దని రాజా సింగ్ కోరారు.

BJP MLA Raja Singh welcomes revanth reddy words as calling PM Modi as big brother

పదేళ్ల కాలంలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చిందో ప్రజలకు రేవంత్ రెడ్డి తెలియజేయాలన్నారు. బీఆర్ఎస్ నేతలు చేసిన అవినీతిని కూడా ప్రజల ముందు పెట్టాలని రాజా సింగ్ డిమాండ్ చేశారు. పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసేందుకు ప్రధాని మోడీ తెలంగాణకు సోమవారం వచ్చిన విషయం తెలిసిందే. ప్రధానితో వేదిక పంచుకున్న సీఎం రేవంత్.. మోడీని బడే బాయ్ అన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర సహకారం అవసరమని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు.

మరోవైపు, సీఎం రేవంత్ చేసిన ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శలు చేశారు. కేంద్ర బడ్జెట్‌​లో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వని ప్రధాని మోడీ పెద్దన్న ఎలా అవుతారని కవిత (Kavitha) ప్రశ్నించారు. ప్రధానిని పెద్దన్న అని సీఎం రేవంత్ రెడ్డి అనడం మంచిదే కానీ.. ఆ పెద్దన్న తెలంగాణకు ఏమీ చేయలేదని వ్యాఖ్యానించారు.

రేవంత్ వ్యాఖ్యలతో కాంగ్రెస్, బీజేపీ మధ్య ఉన్న బంధం బయట పడిందని కవిత చెప్పుకొచ్చారు. పెద్దన్న నుంచి నిధులు తీసుకురావాల్సిన బాధ్యత సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)పై ఉందని ఆమె అన్నారు. ప్రజాప్రతినిధుల విషయమై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. ఆ తీర్పును స్వాగతించిన ప్రధాని, ఆయా కేసుల దర్యాప్తు వేగవంతం తెలంగాణ నుంచే ప్రారంభించాలని కవిత కోరారు.

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి మొదటి ముద్దాయిగా ఉన్నారని, కేసును కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేయాలన్నారు కవిత. సోనియాను బలిదేవత అన్న సీఎం ఇవాళ సోనియా, రాహుల్‌​ను పోటీకి ఆహ్వానిస్తున్నారని ఆమె ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ చేసిన అన్యాయాన్ని గుర్తు పెట్టుకొని ఆ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని ఓటర్లకు కవిత పిలుపునిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+