షర్మిల బాటలో ఎమ్మెల్సీ కవిత - అక్కడే ట్విస్ట్..!?
ఎమ్మెల్సీ కవిత సంచలనంగా మారింది. తన తండ్రి కేసీఆర్ కు రాసిన లేఖ బయటకు రావటం తో గులాబీ పార్టీలో కలకలం మొదలైంది. కవిత లేఖ పైన కేసీఆర్ కుటుంబాన్ని కాంగ్రెస్ నేతలు టార్గెట్ చేస్తున్నారు. కవిత బీఆర్ఎస్ వీడటానికి సిద్దమయ్యారనే చర్చ మొదలైంది. కవిత కాంగ్రెస్ వైపు చూస్తున్నారంటూ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు ఈ లేఖ పై ఇప్పటి వరకు స్పందించ లేదు. కాగా, అన్న మీద కోసం ఈ విధంగా కవిత చూపిస్తున్నారని.. షర్మిల తరహాలోనే కవిత రాజకీయ ప్రయాణం ఉంటుందనే విశ్లేషణలు మొదలయ్యాయి.
కవిత లేఖతో
కవిత మాజీ సీఎం కేసీఆర్ కు రాసిన లేఖ బయటకు వచ్చింది. తెలంగాణ రాజకీయాలను షేక్ చేసింది. తండ్రితో నేరుగా చెప్పుకునే అవకాశం.. పార్టీలో వ్యవహారాల పైన చర్చించే ఛాన్స్ ఉన్నా ఇలా ఓపెన్ గా లేఖ రాయటం వెనుక ఉద్దేశం ఏంటనేది అంతు చిక్కని అంశంగా మారింది. దీని పైన బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఎవరూ స్పందించ లేదు. బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు ఖాయమంటూ సాగుతున్న ప్రచారం వేళ ఈ ప్రతిపాదన ఇష్టం లేని కవిత ఈ తరహాలో లేఖ రాసారని చర్చ సాగు తోంది. అయితే, బీజేపీ పొత్తు అంశాన్ని బీఆర్ఎస్ నేతలు ఖండిస్తున్నారు. ఈ లేఖ ద్వారా కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తున్నారు.

షర్మిల తరహాలో
కాగా, కవిత లేఖతో షర్మిల వ్యవహారం మరో సారి తెర పైకి వచ్చింది. తన తండ్రి నుంచి రావాల్సిన ఆస్తులు.. రాజకీయ వారసత్వం విషయంలో జగన్ తో విభేదించి షర్మిల బయటకు వచ్చారు. కొత్త గా పార్టీ ఏర్పాటు చేసి తెలంగాణలో పోటీకి సిద్దమయ్యారు. ఆ తరువాత కాంగ్రెస్ నేతల చర్చలతో తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసారు. కాంగ్రెస్ లో ఏపీ ఏపీకి పీసీసీ చీఫ్ అయ్యారు. ఇప్పుడు తన అన్న పైనే రాజకీయ పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ లో కేటీఆర్ కు పార్టీ పగ్గాలు అప్పగిస్తారనే ప్రచారం సాగుతోంది. ఇందుకు హరీష్ సైతం మద్దతుగా నిలిచారు. ఈ సమయం లో కవిత రాసిన లేఖ ద్వారా ఈ ప్రతిపాదనకు కవిత సుముఖంగా లేరా అనే సందేహం కనిపిస్తోంది.
కవిత నెక్స్ట్
తెలంగాణ ఉద్యమంలో కవిత యాక్టివ్ గా పని చేసారు. సంస్థగా జాగృతిని బలోపేతం చేయటంలో సక్సెస్ అయ్యారు. గతేడాది ఆగస్టులో సుప్రీంకోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేయడంతో హైదరా బాద్ చేరుకున్న ఆమె.. కొద్ది నెలలు మౌనం దాల్చారు. నాలుగు నెలల కాలంగా తిరిగి రాజకీయం గా యాక్టివ్ అయ్యారు. ఇప్పుడు కాంగ్రెస్ పైన వ్యతిరేకత పెరిగిందని.. తమకు తిరిగి అధికారం ఖాయ మని బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేసుకుంటున్న వేళ కవిత లేఖ అంతు చిక్కటం లేదు. షర్మిల తరహాలోనే కవిత వ్యవహరిస్తారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ లో చేరుతారని జోస్యం చెబుతున్నారు. మరి.. కవిత ఏం చేయబోతున్నారు.. షర్మిల తరహాలో వ్యవహరిస్తారా.. బీఆర్ఎస్ వీడుతారా.. లేక, తన కుటుంబ పార్టీలోనే కొనసాగుతారా అనేది ఆసక్తి కరంగా మారింది.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!












Click it and Unblock the Notifications