మోదీ ఆఫర్ ఇచ్చినా ఎవరూ.. అప్పుడు బండి సంజయ్ పేరు చెప్పాను..!!

తెలంగాణ బీజేపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేంద్ర మంత్రివర్గం- పార్టీలో మార్పుల దిశగా కసరత్తు జరుగుతోంది. తెలంగాణ నుంచి ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో ఇద్దరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మార్పులు- చేర్పులు ఉంటాయని అంచనాలు ఉన్నాయి. ఇదే సమయంలో తెలంగాణ బీజేపీలో కోల్డ్ వార్ చర్చనీయాంశంగా మారింది. తాజా పరిస్థితుల వేళ బీజేపీ ఎంపీ ధర్వపురం అర్వింద్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి కరంగా మారాయి.

బీజపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ప్రధాని మోదీ ఆఫర్‌ ఇస్తే ఎవరూ కాదనలేరని, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి మోదీ ఓ చాన్స్‌ ఇచ్చారని వ్యాఖ్యానించారు. మోదీ ప్రతిపాదన విషయంలో.. భవిష్యత్తులో రేవంత్‌ పశ్చాత్తాపపడొచ్చని పేర్కొన్నారు. సువేందు అధికారి, ఏక్‌నాథ్‌ షిండేలాగే రేవంత్‌రెడ్డికి ఆఫర్‌ ఇచ్చారేమో.. అంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అధికారంలోకి రాకపోవడం తమ పార్టీ తప్పేనని, ప్రజలు తమను కోరుకోలేదన్నది నిజమని స్పష్టంచేశారు. రాష్ట్రం లో పెద్ద గ్రూప్‌ లీడర్లు లేకపోవడం ప్రధాన సమస్యగా మారిందని అభిప్రాయపడ్డారు. రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌తో వివాదంపై స్పందిస్తూ.. పార్టీలో అభిప్రాయ భేదాలు ఉంటాయని, అయితే తాను ఎవరిపై ఫిర్యాదులు చేయలేదని తెలిపారు.

త్రివేణి సంగమం..పోటెత్తిన భక్త జనం- పుష్కర స్నానాలు, ప్రత్యేకతలు..!!
త్రివేణి సంగమం..పోటెత్తిన భక్త జనం- పుష్కర స్నానాలు, ప్రత్యేకతలు..!!
bjp-mp-arvind-made-key-comments-over-party-interenal-disuptes-and-leader-ship-decisions-in-telangan

రాష్ట్రంలో బీజేపీకి స్థానికంగా ఎలాంటి సీఎం ముఖం అవసరం లేదని, ప్రధాని నరేంద్ర మోదీయే తమ పార్టీకి అసలైన ముఖమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో తాను ఉన్న విషయాన్ని అరవింద్ ఓపెన్‌గా ఒప్పుకున్నారు. రాష్ట్ర అధ్యక్ష పదవిని తాను అడిగిన మాట వాస్తవమే, కానీ అది తనకు దక్కలేదని చెప్పారు. అధిష్ఠానం తనను రెండో పేరు చెప్పమంటే.. తాను బండి సంజయ్ పేరు సూచించినట్లు అరవింద్ వెల్లడించారు. ఒకవేళ తనను అధ్యక్షుడిగా నియమిస్తే పార్టీకి మరింత ప్లస్ అయ్యేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూనే.. పదవుల కోసం తనకు ఎలాంటి ఆరాటం లేదన్నారు. ఏమి ఇస్తారో, ఏమి ఇయ్యరో తన చేతిలో లేదని.. తన తండ్రికి కూడా సీఎం కావాలనే కోరిక ఎప్పుడూ లేదు, ఆయనకు పార్టీ ప్రెసిడెంట్ పదవి పైనే ఆసక్తి ఉండేదని వివరించారు. 49 ఏళ్ల వయసులో తనకు ఎలాంటి వ్యక్తిగత కోరికలు లేవు, ఏ బాధ్యత ఇచ్చినా ప్యాషన్‌తో చేస్తానని అర్వింద్ చెప్పుకొచ్చారు. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వంలో సగం క్యాబినెట్‌లో క్వాలిటీ కాంగ్రెస్‌ లేదని, సీఎం రేవంత్‌రెడ్డి దగ్గర పనిచేసేందుకు మంత్రులే ఇష్టపడటం లేదని, తెలంగాణలో వామపక్ష భావజాలం లేదని అరవింద్‌ అభిప్రాయపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+