సమంతను అంబాసిడర్‌గా ఎందుకు నియమించారు..? దాని వెనుక ఆంతర్యం ఏంటి ..?
ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తాను ఎన్ కన్వెన్షన్ హాల్‌ను అన్ని అనుమతులు తీసుకునే నిర్మించామని నాగార్జున చెబుతుండగా, తుమ్మిడి చెరువులో 3 ఎకరాల 30 గుంటలను ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మించారని అధికారులు చెబుతున్నారు. దీంతో తుమ్మిడి చెరువులో మూడున్నర ఎకరాల భూమిలో ఉన్న ఈ నిర్మాణాన్ని అధికారులు శనివారం కూల్చేశారు.
దీనిపై రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. రాష్ట్రంలో అన్ని అక్రమ కట్టడాలను ఇదే విధంగా కూల్చివేయాలని డిమాండ్ తెర మీదకు వచ్చింది. దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి ఎన్ని ఒత్తిడిలు వచ్చినా ఈ విషయంలో తగ్గేది లేదని తేల్చి చెప్పారు. ఇలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టిన ఎవర్నీ వదిలిపెట్టబోమని ఆయన చెప్పారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ వివాదంలోకి అక్కినేని నాగార్జున మాజీ కోడలు, హీరోయిన్ సమంతను తెరపైకి తీసుకువచ్చింది బీజేపీ. ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన కామెంట్స్ చేశారు.

పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎన్ కన్వెన్షన్ పై ఎందుకు చర్యలు తీసుకోలేదని మాజీ మంత్రి కేటీఆర్‌ను ప్రశ్నించారు. ఎన్ కన్వెన్షన్ పై చర్యలు తీసుకుని చెరువు భూమిని గుర్తించాలని 2014లో హై కోర్టు ఆదేశించింది. దీనిపై అప్పటి మంత్రి కేటీఆర్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. పదేళ్లు మౌనంగా ఉన్నారు. పైగా నాగార్జున మాజీ కోడలు సమంతని తీసుకువచ్చి తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారు. దాని వెనుక ఆంతర్యం ఏంటి అంటూ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన ఈ వివాదంలోకి సమంతని కూడా లాగినట్లు అయింది. ఇన్నాళ్లు ఎన్ కన్వెన్షన్‌పై సంపాదించిన డబ్బంతా తెలంగాణ ప్రభుత్వ ఖజానాకు చేరేలా రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications