Adipurush: ఆదిపురుష్ దెబ్బుకు క్రాష్ అయిన టికెట్ బుకింగ్ సైట్..

ప్రముఖ హీరో ప్రభాస్(Prabhas) కు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా భారీగా ఫ్యాన్స్ ఉన్నారు. ప్రభాస్ తాజాగా నటించిన చిత్రం ఆదిపురుష్ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రపంచవ్యాప్తంగా ఆదిపురుష్ 6200 స్క్రీన్లలో విడుదల కానుంది. ఇందుకు సంబంధించి మంగళవారం రాత్రి నుంచి టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఈ సినిమా టికెట్లు బుక్ మై షోలు అందుబాటులో ఉన్నాయి. అయితే బుకింగ్స్ ప్రారంభమైన గంటల్లోనే బుక్ మై షో సైట్ క్రాష్ అయింది. ఫ్యాన్స్ భారీ ఎత్తున టికెట్ల బుకింగ్ కోసం ప్రయత్నంచడంతో సైట్ క్రాష్ అయినట్లు తెలుస్తోంది.

తెల్లవారుజాము 4 గంటల వరకు సైట్ క్రాష్ అయినట్లు తెలిసింది. ఆ తర్వాత బుకింగ్స్ తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే గంటల వ్యవధిలోనే ఆదిపురుష్ టికెట్లు అమ్ముడుపోయాయి. శుక్రవారానికి సంబంధించిన టికెట్లే కాదు.. శని, ఆదివారాలకు సంబంధించి టికెట్స్ కూడా అమ్ముడైనట్లు తెలుస్తోంది. అటు దేశవ్యాప్తంగా కూడా ఆదిపురుష్ టికెట్ల బుకింగ్ జరుగుతోంది. ఆదిపురుష్ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలు కాబోతోంది.ఈ సినిమా మొదటి రోజే భారీగా వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది.

 adipurushticketbooking1

కాగా ఈ చిత్రం ఓటీటీ విడుదలపై వార్తలు వస్తున్నాయి. ఈ మూవీని ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీ హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. స్వతంత్ర్యదినోత్సవం సందర్భంగా అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా విడుదల చేసే అవకాశం ఉంది. అన్ని భాషల్లో కలిపి ఆదిపురుష్ ఓటీటీ హక్కులను 250 కోట్లకు అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్నట్లు సమాచారం. ఆదిపురుష్ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రూ.100 కోట్ల వరకు వచ్చినట్లు తెలుస్తోంది.

బాలీవుడ్‌ సింగర్‌ అనన్య బిర్లా 10వేల ఆదిపురుష్ సినిమా టికెట్లను బుక్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. అనాథపిల్లల కోసం వీటిని కొన్నట్లు ఆమె చెప్పారు. ఆదిపురుష్ సినిమా 2 గంటల 59 నిమిషాలు ఉండనుంది. ఆదిపురుష్ సినిమాను రూ. 500 కోట్లతో 3డీ ఫార్మాట్‌లో తెలుగు, హిందీలో ఏకకాలంలో నిర్మించారు. ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదు కావాల్సి ఉన్నా టీజర్ పై విమర్శలు రావడంతో పలు మార్పులు చేయడంతో ఆలస్యమైనట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+