ఈ విచిత్రం వాస్తవమేనా?: నీళ్ల కోసం బోర్ వేస్తే నాణేలు బయటపడ్డాయి!
Recommended Video

Coins Coming From Bore Well | నీళ్ల కోసం బోర్ వేస్తే డబ్బులు బయటపడ్డాయి! | Oneindia Telugu
మహబూబ్ నగర్: పాలమూరు జిల్లాలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. శాంతినగర్‌లో ఓ బోరు బావి నుంచి నాణేలు (డబ్బులు) బయటకు వచ్చాయి.
అయితే ఇవి ఎలా వచ్చాయి, ఎందుకు వచ్చాయో తెలియలేదు. అవి ఎలా వచ్చాయో తెలియనప్పటికీ ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో బోరు బావి తవ్వుతుండగా నీరు ఉబికి వచ్చింది. అక్కడే పక్కన నాణేలు కూడా కొందరు తమ గుప్పిళ్లలో పట్టుకొని చూపారు. అవి ఎలా వచ్చాయి, ఎందుకు వచ్చాయి, నిజంగానే వస్తున్నాయా అనేది తెలియరాలేదు. కానీ వీడియో మాత్రం వైరల్ అవుతోంది.













Click it and Unblock the Notifications