బాబును ఏ1గా ఎందుకు చేర్చలేదు: కెసిఆర్‌కు బొత్స నిలదీత, 'బాబు సాక్షి మాత్రమే'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొద్ది నెలల క్రితం జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వెలుగు చూసిన ఓటుకు నోటులో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును ఏ1 ముద్దాయిగా చేర్చాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, పిసిసి మాజీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ మంగళవారం డిమాండ్ చేశారు.
చంద్రబాబును ఏ1గా ఎందుకు చేర్చలేదో తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ఎసిబి సమాధానం చెప్పాలన్నారు. ఎసిబి తన ఛార్జీషీటులో చంద్రబాబు పేరును 22సార్లు ప్రస్తావించిందన్నారు. ఓటుకు నోటు కేసు చంద్రబాబు డైరెక్షన్లో జరిగిందని అన్ని పత్రికలు పేర్కొన్నాయని చెప్పారు.

చంద్రబాబును ఏ1గా చేర్చాలన్నారు. వెంటనే చంద్రబాబును ఏ1గా చేర్చాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. చంద్రబాబు స్థానంలో ఓ సామాన్యమైన వ్యక్తి ఉంటే ఇలాగే విడిచిపెడతారా అని ప్రశ్నించారు.
చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లేది ప్రత్యేక హోదా కోసం కాదని ఓటుకు నోటు కేసులో బయటపడేందుకని ఆరోపించారు. బీహార్‌కు భారీ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించినప్పటికీ చంద్రబాబు ఇంకా మౌనంగా ఎందుకు ఉన్నారో చెప్పాలన్నారు. ఏ తప్పు చేయకుంటే కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదన్నారు.
అది పొలిటికల్ ఛార్జీషీట్: రవీంద్ర కుమార్
ఓటుకు నోటు కేసులో వేసింది లీగల్ ఛార్జీషీటు కాదని, అది కెసిఆర్ - జగన్ కాంబినేషన్ పొలిటికల్ ఛార్జీషీట్ అని టిడిపి లీగల్ సెల్ అధ్యక్షులు రవీంద్ర కుమార్ మండిపడ్డారు. ఈ కేసులో చంద్రబాబు ముద్దాయి కాదని, సాక్షి అని అయినప్పటికీ చంద్రబాబు పేరు 22 సార్లు ప్రస్తావించారన్నారు. బాబు విశ్వసనీయతను దెబ్బతీయాలని చూస్తున్నారన్నారు.












Click it and Unblock the Notifications