తెలుగు వారి గొప్పతనాన్ని తెలిపిన బ్రిటిష్ ఎయిర్‌వేస్ (వీడియో)
హైదరాబాద్: బ్రిటిష్ ఎయిర్‌వేస్ తాజాగా రూపొందించిన ఒక ప్రకటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌లా వెళుతోంది. ఆ యాడ్ చూసిన ప్రతి ఒక్కరూ వారియొక్క నానమ్మ, అమ్మమ్మలను తప్పక తలుచుకుంటున్నారు. అంతలా నెటిజన్లను ఆకర్షించిన ఆ వీడియోలో ఏముంది?
తెలుగు వారు అంటేనే మర్యాదకు, అప్యాయతకు పెట్టింది పేరు. ఈ కాలంలో ఆధునిక పోకడల వల్ల మన తెలుగు వారి మర్యాదలు పూర్తిగా మారిపోతున్నాయి. ఈ నేపథ్యంలో మన మర్యాదలను మనమే మరిచిపోతున్న సమయంలో బ్రిటిష్ ఎయిర్‌వేస్ ఒక చక్కని వీడియో ద్వారా మన సంప్రదాయాలను, తెలుగింటి రుచులను మనకు గుర్తు చేశారు.
బ్రిటిష్ ఎయిర్‌వేస్ రూపొందించిన ఈ యాడ్ ఓ ఎయిర్ హోస్టెస్‌కి ఒక తెలుగుంటి బామ్మకి మధ్య జరిగిన ఒక నిజ జీవిత సంఘటన ఆధారంగా రూపొందించారు. ఈ యాడ్ ఎంతో భావోద్వేగంతో కూడుకుని ఉంది. అంతేనా ఈ యాడ్ గురించి వాల్ స్ట్రీట్ జర్నల్ ఒక కథనంగా రాసింది.
ఈ యాడ్‌ను ఇప్పటి వరకు యూట్యూబ్‌లో పదిహేడు లక్షల మంది వీక్షించారు. ఈ కమర్షియల్ యాడ్‌కి మాసన్ డైరెక్టర్ నీరజ్ గవాన్ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా నీరజ్ మాట్లాడుతూ ఇంత పెద్ద ఎత్తున ఈ యాడ్‌కి స్పందన వస్తుందని తాను ఊహించలేదని తెలిపారు.
సేపియంట్‌నిట్రో ఏజెన్సీ ఇచ్చిన ఐడియా ఆధారంగా ఈ యాడ్‌ను రూపొందించామని తెలిపారు. ఈ యాడ్‌కు వచ్చిన స్పందన చూస్తుంటే చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ యాడ్‌ను వీక్షించిన బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ స్వయంగా ఫోన్ చేసి తనను అభినందించారని ఆయన పేర్కొన్నారు.
ఈ యాడ్‌లో పలికిన భావోద్వేగాలు ప్రతి ఒక్కరి మనసుకి అత్తుకునేలా చేశాయని తెలిపారు. ఈ యాడ్‌కు సురోజ్ దత్ మాటలను అందించగా, ఈ యాడ్‌లో నటి ఉమా టుంబల్కర్ నానమ్మ పాత్ర పోషించారని పేర్కొన్నారు. ఈ పాత్ర కోసం నీరజ్ ప్రత్యేకించి ఉమా టుంబల్కర్‌ను ఎంపిక చేసుకోవడంలో ఓ ప్రత్యేకత ఉందన్నారు.
ఆమె చూడగానే ఈ పాత్రకు సరిగ్గా సరిపోతుందని అనుకున్నట్లు చెప్పారు. ఇంతకీ ఈ యాడ్ ప్రత్యేకత ఏంటంటే... ఈ యాడ్‌లో నటించిన ఉమా టుంబల్కర్ హైదరాబాద్‌లో ఓ గృహిణి పాత్రలో నటించారు. ప్రపంచ ప్రఖ్యాత సంస్ధ అయిన బ్రిటిష్ ఎయిర్‌వేస్ తన యాడ్‌లో హైదరాబాద్‌కు సంబంధించినట్లుగా చూపించడమే.
ఈ యాడ్ ఓ ఫీల్ గుడ్‌లా అనిపిస్తోంది. అంతేకాదు ఎంతో మంది తెలుగు వారు మరిచిపోయిన తెలుగింటి అప్యాయతలు, సంప్రదాయాలను చాలా అందంగా ఇందులో చూపించారు. బ్రిటిష్ ఎయిర్‌వేస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసిన ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications