బీఆర్ఎస్ 3.0 సక్సెస్; కంగ్రాచ్యులేషన్స్ కేసీఆర్.. మీరే గెలిచారు!!
ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడుని మార్పు చేయడం రాష్ట్రవ్యాప్తంగా దుమారంగా మారింది. సోషల్ మీడియాలో సీఎం కేసీఆర్ కు కంగ్రాచులేషన్స్ చెబుతూ పెద్ద ఎత్తున రచ్చ జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఇక గెలిచే పరిస్థితులు లేవని, సీఎం కేసీఆర్ ను బలంగా ప్రస్తుత తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఎదుర్కోలేరని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.
వచ్చే ఎన్నికలలో మళ్లీ బీఆర్ఎస్ దే విజయం అంటూ అప్పుడే ప్రచారం కొనసాగుతుంది. కంగ్రాచ్యులేషన్స్ కేసీఆర్ అంటూ కిషన్ రెడ్డి కెసిఆర్ కలిసి ఉన్న ఫోటోలను పోస్ట్ చేసి ట్వీట్ చేస్తున్నారు. ఇక ఇదే అదునుగా కాంగ్రెస్ అభిమానులు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని మార్చడాన్ని టార్గెట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు.

దీంతో తెలంగాణ కాంగ్రెస్ కు మరింత జవసత్వాలు వచ్చాయని, తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ కాంగ్రెస్ అని చర్చ జరుగుతుంది. బిజెపి, బిఆర్ఎస్ బీ టీమ్ అని తాజా అధ్యక్షుడి మార్పుతో అందరికీ అర్థం అవుతుందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీంతో తెలంగాణలో కాంగ్రెస్ విజయం ఖరారైందని అంటున్నారు.
వచ్చే ఎన్నికల్లో బలమైన గొంతు వినిపించకుండా కిషన్ రెడ్డి కి పట్టం కట్టారని పలువురు చర్చలు జరుపుతున్నారు. అంతేకాదు కెసిఆర్ ను బుజ్జగించడానికి కిషన్ రెడ్డి ని నియమించాలని నిర్ణయం తీసుకున్నారని, ఈ ఎన్నికలలో బిజెపి విజయావకాశాలను కోల్పోయిందని, ఖచ్చితంగా గెలిచే అవకాశం లేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో బీజేపీ పోరాటాన్ని వదిలిపెట్టి, బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నట్టుగా కనిపిస్తుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
బండి సంజయ్ ఇంత కాలం చేసిన కష్టమంతా నీరుగారిపోయింది అని పోస్టులు పెడుతున్నారు. ఇది సీఎం కేసీఆర్ కు చాలా సంతోషం కలిగిస్తుందని చెబుతున్నారు. బీఆర్ఎస్ 3.0 100% సక్సెస్ అవుతుందని పేర్కొంటున్నారు. కిషన్ రెడ్డి వల్ల పార్టీకి లాభం జరగదని, కిషన్ రెడ్డి లో పోరాట పంథా ఉండదని అంటున్నారు.
కిషన్ రెడ్డి మంచి లీడర్ అయినా.. పార్టీని నడిపించే సామర్ధ్యం ఉన్న లీడర్ కాదని, ఆయన పార్టీని ముందుకు నడిపించలేరని సోషల్ మీడియాలో ప్రస్తుతం రచ్చ కొనసాగుతోంది. ఇక అందరూ కలిసి కంగ్రాచ్యులేషన్స్ కేసీఆర్ .. మీరే గెలిచారు అంటూ పోస్టులు పెట్టడం ఆసక్తికరంగా మారింది. ఇది కేసీఆర్ మాస్టర్ మైండ్ అని కూడా కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications