Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటి కాదా?: ఖర్గేకు సవాల్ విసురుతూ కిషన్ రెడ్డి కీలక ప్రశ్నలు

హైదరాబాద్: కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే దోస్తాన్ ఉందన్నారు కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. చేవెళ్ల ప్రజా గర్జన సభలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే పచ్చి అబద్ధాలు మాట్లాడారని అన్నారు. కేసీఆర్‌కు బీజేపీతో అంతర్గత స్నేహం కుదిరిందని.. అందుకే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం మానేశారన్న ఖర్గే వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు.

తెలంగాణలో బీజేపీకి పెరుగుతున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక బీఆర్ఎస్‌ను గెలిపించేందుకు కాంగ్రెస్ మరోసారి కుట్ర చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒకటే. ఈ రెండు పార్టీల మధ్య మతతత్వ మజ్లిస్ దోస్తీ కుదుర్చుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బీఆర్ఎస్‌కు ఓటేసినట్లే అవుతుందని ప్రజలకు అర్థమైందని కిషన్ రెడ్డి అన్నారు.

BRS always with Congress: Kishan Reddy slams Mallikarjun kharge comments

చేవెళ్ల సభలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే అబద్దాలతో తెలంగాణ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారన్నారు కిషన్ రెడ్డి. పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఒకరికొకరు మద్దతు తెలుపుకున్న విషయాన్ని ఖర్గే మరిచిపోయారని అన్నారు. బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ కుటుంబం ఎంతకైనా తెగిస్తారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు మధ్య దోస్తీ లేదనే విషయాన్ని నిరూపించాలనుకుంటే తాను వేసే ప్రశ్నలకు ఖర్గే సమాధానం చెప్పి.. బీజేపీకి క్షమాపణలు చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.

1. పేద ప్రజలకు డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇవ్వ డానికి భూమి లేదని బుకాయిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం.. కాంగ్రెస్‌కు హైదరాబాద్ నడిబొడ్డున ఎకరం భూమి కేవలం ₹2 లక్షల చొప్పున 10 ఎకరాల విలువైన భూమిని కట్టబెట్టింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.

2. కేటీఆర్ ఇటీవల తన ప్రసంగంలో మాట్లాడుతూ బీజేపీని ఓడించడానికి బీజేపీ వ్యతిరేక కూటమితో కలిసి పోరాడుతామని,సంకీర్ణ ప్రభుత్వంలో కీలకమైన పాత్ర పోషిస్తామని స్పష్టం చేశారు. మీ రెండు పార్టీల మధ్యనున్న అవగాహనకు ఇదొక ఉదాహరణ కాదా? అని అన్నారు.

3. తెలంగాణలో హస్తం గుర్తుమీద గెలిచిన చాలామంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయకుండానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. పార్టీ ఫిరాయింపుల చట్టం కింద మీ ఎమ్మెల్యేల మీద మీరు చర్యలు తీసుకోకపోవడం మీ రెండు పార్టీల మధ్య ఉన్న సత్సంబంధాలకు నిదర్శనం కాదా?

BRS always with Congress: Kishan Reddy slams Mallikarjun kharge comments

4. రాష్ట్రపతి ఎన్నికలలో ఒక గిరిజన మహిళను రాష్ట్రపతిగా ఎన్నుకునే చారిత్రాత్మక అవకాశాన్ని కాదని, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు తెలపడంతోపాటుగా.. ఆ ఎన్నికల ప్రచారాన్ని తెలంగాణలో కేసీఆర్ ముందుండి నడపడం మీ మధ్య ఉన్న దోస్తీకి చిన్న ఉదాహరణ కాదా? మీ రెండు పార్టీలు ఒక వేదికమీద ఉన్నారనేది నిజం కాదా?

5. శాసనమండలిలో కాంగ్రెస్‌ను పూర్తిగా బీఆర్ఎస్‌లో విలీనం చేసేసినప్పుడు దీనిమీద స్పందించకపోవడం మీ మద్య దోస్తీకి పరాకాష్ట కాదా? ఈ విలీనంతో మీరిద్దరూ సంతోషంగా ఉన్నారనేది నిజం కాదా?

6. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య మతతత్వ మజ్లిస్ సయోధ్య కుదుర్చుతోంది. అందుకే మీరంతా కలిసి ఉమ్మడి పౌరస్మృతి (UCC)ని వ్యతిరేకిస్తున్నది నిజం కాదా? బీఆర్ఎస్ మద్దతులేకుండా UCCని వ్యతిరేకిస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పగలదా?

7. మొన్నటికి మొన్న లోక్‌సభ సమావేశాలలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ కలిసి అనుకూలంగా ఓటు వేసిన విషయం వాస్తవం కాదా? ఢిల్లీలో చట్టాలు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుందని తెలిసి కూడా, ఢిల్లీ ప్రభుత్వ సర్వీసుల బిల్లుపై ఆప్, కాంగ్రెస్ పార్టీలకు మద్దతుగా బీఆర్ఎస్ ఓటు వేయడం నిజం కాదా? దీన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందా?

8. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో కేసీఆర్ కేంద్ర మంత్రిగా పని చేశారు. బీఆర్ఎస్ నాయకులు ఇక్కడి కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర మంత్రులుగా అధికారాన్ని అనుభవించలేదా? అప్పటినుంచే మీ స్నేహం కొనసాగుతున్నది నిజం కాదా?

ఈ ప్రశ్నలకు మల్లికార్జున ఖర్గే సమాధానం ఇవ్వలేకపోతే.. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్-బీఆర్ఎస్ పొత్తుందని మరోసారి రాష్ట్ర ప్రజలకు ధృవీకరించినట్లే అవుతుందని కిషన్ రెడ్డి ప్రకటనలో తెలిపారు. బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ నేతలు ఎంతకైనా తెగిస్తారన్నారు. అవసరమైతే తమ ఓటును పూర్తిగా బీఆర్ఎస్‌కు బదిలీ చేయడం ద్వారా తెలంగాణలో బీజేపీ ప్రభంజనాన్ని అడ్డుకోవాలనేది కాంగ్రెస్ ఆలోచని అని కిషన్ రెడ్డి మండిపడ్డారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+