మోదీ-షాలకు బిగ్ షాక్: బీజేపీ నుంచి బీఆర్ఎస్‌లోకి: కీలక నేతలు జాయినింగ్..!!
బీఆర్ఎస్‌కు బిగ్ బూస్ట్. ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్.. బీజేపీకి గుడ్ బై చెప్పారు. ఎల్లుండి గులాబీ కండువాను కప్పుకోనున్నారు. ఎల్లుండి హైదరాబాద్ లో కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ తీర్థాన్ని పుచ్చుకోనున్నారు.
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో అధికారంలో ఉన్న భారత్ రాష్ట్ర సమితికి బిగ్ బూస్ట్. ఈ ఏడాదే అసెంబ్లీ, వచ్చే సంవత్సరం సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనడానికి సమాయాత్తమౌతోన్న ఈ గులాబీ బాస్.. క్రమంగా తన పార్టీ కార్యకలాపాలను పొరుగు రాష్ట్రాలకు విస్తరిస్తోన్నారు. ఈ క్రమంలో- రాకీయ బద్ధ శతృవు బీజేపీ నుంచి కూడా బీఆర్ఎస్ లోకి కీలక నాయకులు వలస వస్తోండటం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది.

ఇప్పటికే ఏపీలో పాగా..
బీఆర్ఎస్ ఇప్పటికే ఏపీలో పాగా వేసింది. పలువురు సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. ఇది అక్కడితో ఆగేలా లేదు. మున్ముందు బీఆర్ఎస్ లో చేరే ఏపీ నాయకుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు ఉన్నాయి.

ఊహించిన దాని కంటే వేగంగా..
ఊహించిన దాని కంటే వేగంగా బీఆర్ఎస్.. ఏపీలో అడుగు పెట్టింది. చేరికలకు గేట్లు ఎత్తేసింది. ఫలితంగా- పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు బీఆర్ఎస్ లో చేరిన విషయం తెలిసిందే. రిటైర్డ్ ఐఎఎస్ అధికారి తోట చంద్రశేఖర్, మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు, పార్థసారథి తదితరులు.. కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువాను కప్పుకొన్నారు. బీఆర్ఎస్ కార్యకలాపాలను విస్తరించడానికి పార్టీ నాయకులు సన్నాహాలు మొదలు పెట్టారు.

ఒడిశాలో..
తాజాగా ఒడిశాలో ఎంట్రీ ఇచ్చింది బీఆర్ఎస్. ఏకంగా బీజేపీ సీనియర్ నాయకులపైనే గురి పెట్టింది. ఈ క్రమంలో విజయం సాధించింది కూడా. మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్.. బీఆర్ఎస్ లో చేరనున్నారు. 1999లో ఒడిశా ముఖ్యమంత్రిగా పని చేశారు. కోరాపుట్ లోక్ సభ నుంచి తొమ్మిదిసార్లు విజయం సాధించారు. ఒడిశా రాజకీయాలపై తనదైన ముద్ర వేశారు.

ఎల్లుండే ముహూర్తం..
ఎల్లుండి హైదరాబాద్ లో కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువాను కప్పుకోనున్నారు. 2015లో ఆయన బీజేపీలో చేరారు. గమాంగ్ తో పాటు లోక్ సభ మాజీ సభ్యుడు జయరాం పంగీ కూడా బీఆర్ఎస్ లో చేరనున్నారు. ఇవ్వాళ గిరిధర్ గమాంగ్.. బీజేపీకి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పంపించారు. ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసినట్లు ప్రకటించారు.












Click it and Unblock the Notifications