బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు: కేసీఆర్ అనుకున్నదొకటి అవుతుందొకటి!!
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ, మూడోసారి కూడా వచ్చే ఎన్నికలలో తిరుగులేని విజయాన్ని సాధించి గులాబీ జెండాను రెపరెపలాడించాలని భావిస్తుంది. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ పిలుపుమేరకు బీఆర్ఎస్ నేతలు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో ఆత్మీయ సమావేశాలను నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఆత్మీయ సమావేశాలలో నేతల మధ్య ఉన్న విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.
ఇక పార్టీలో తమను పట్టించుకోని నేతలను ఆత్మీయ సమావేశాల సాక్షిగా పార్టీ క్యాడర్ నిలదీస్తోంది. పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపి అందరూ సంఘటితంగా ఎన్నికలకు వెళ్లాలని భావించి బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయిస్తే, అది కాస్త బూమరాంగ్ అయ్యి బిఆర్ఎస్ లో ఉన్న అంతర్గత విభేదాలను రోడ్డున పెడుతోంది.
రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలను ఏప్రిల్ 25వ తేదీలోపు పూర్తి చేయాలని భావించిన బిఆర్ఎస్ పార్టీ, ఈ మేరకు శ్రేణులకు దిశానిర్దేశం చేసింది. ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించడానికి సమన్వయకర్తలుగా జిల్లా ఇన్చార్జిలను నియమించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలోను ఆత్మీయ సమ్మేళనాలు కొనసాగుతున్నాయి. అయితే పార్టీ శ్రేణులు అందరిని ఏకతాటి మీదికి తీసుకురావడం ఉద్దేశంగా నిర్వహిస్తున్న ఈ సమావేశాలు, కేవలం కేసీఆర్ భజన చేసే సమావేశాలుగా మారాయి.

ఇక కొన్నిచోట్ల పార్టీలో కష్టపడుతున్నప్పటికీ గుర్తింపు రావడం లేదని, కొందరు సమావేశాలు సాక్షిగా నిలదీతల పర్వాన్ని కొనసాగిస్తున్నారు. ఇక ఆయా నియోజకవర్గాలలో, జిల్లాలలో ఉన్న ఆధిపత్య పోరు కూడా ఆత్మీయ సమావేశాల సాక్షిగా బయటపడుతుంది. ఇక ఆత్మీయ సమావేశాలలో మంత్రులు పాల్గొంటే ఆ సమావేశం మంత్రుల ప్రసంగాలకే పరిమితం అవుతుంది. కెసిఆర్ ని పొగడటం , కేంద్రంలోని బిజెపిని తిట్టడం తప్ప సమావేశాలలో కార్యకర్తల మధ్య గ్యాప్ తగ్గించడం కోసం ఎటువంటి ప్రయత్నాలు జరగడం లేదు.
గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నేతలు, ఆ తరువాత పార్టీల వివిధ పార్టీల నుంచి చేరిన నేతలు, వారి కార్యకర్తల మధ్య సమన్వయలేమి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఉదాహరణకు మహబూబాబాద్ జిల్లాలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో రెడ్యానాయక్ ఫోటోని ఫ్లెక్సీలో వేయలేదని, ఆయనకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని కార్యకర్తలు రచ్చ చేశారు. ఇక వికారాబాద్ లోనూ బీఆర్ఎస్ నేతలు రెండు వర్గాలుగా విడిపోయి ఘర్షణకు దిగారు. ఇలా ప్రతి నియోజకవర్గంలోనూ పార్టీలో ఉన్న అంతర్గత కలహాలు బాహాటంగా బయటకు వస్తూనే ఉన్నాయి.
సమావేశాలకు కొంతమంది నేతలను పిలవడం, కొంతమందిని పిలవకపోవడం, ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు వ్యవహరించడం వెరసి ఆత్మీయ సమావేశాలు అసలు అనుకున్న లక్ష్యాన్ని పక్కకు పెట్టి జరుగుతున్నాయి. ఇక ఇప్పటికైనా బిఆర్ఎస్ నేతలలో మార్పు రాకుంటే, పార్టీ కేడర్ మధ్య సమన్వయం కుదరకపోతే వచ్చే ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి గట్టి దెబ్బ తగలడం ఖాయమని పార్టీలోనే అంతర్గతంగా చర్చ జరుగుతుంది. ఇక కేటీఆర్ అనుకున్నది ఒక్కటి కానీ అవుతుంది మాత్రం వేరే అన్నది చర్చనీయాంశం అవుతుంది.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications