కేసీఆర్‌కు భారీ షాక్: కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి

కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు పార్టీని వీడగా.. ఇప్పుడు మరో సీనియర్ నేత కాంగ్రెస్ గూటికి చేరారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​ రెడ్డి ఇంటికి సీఎం రేవంత్​ రెడ్డి వెళ్లారు. ఈ క్రంమలో పోచారాన్ని కాంగ్రెస్​ పార్టీలోకి సీఎం రేవంత్​ రెడ్డి ఆహ్వానించారు.

ముఖ్యమంత్రి రేవంత్ ఆహ్వానం పట్ల పోచారం శ్రీనివాస్ రెడ్డి సానుకూలంగా స్పందించడంతో కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్​ఎస్‌​లో సీనియర్​ నేతగా ఉన్న శ్రీనివాస్​ రెడ్డి, కుమారుడు భాస్కర్​ రెడ్డితో కలిసి హస్తం గూటికి చేరడంతో కేసీఆర్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలినట్లయింది.

BRS MLA Pocharam Srinivas Reddy joins congress party on the presence of CM Revanth Reddy

ఈ సందర్భంగా సీఎం రేవంత్​ రెడ్డి మాట్లాడుతూ.. రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రైతుల సంక్షేమానికి పోచారం ఎన్నో సేవలు అందించారని చెప్పారు. పోచారం సలహాలు, సూచనలు తీసుకునేందుకు వచ్చామని చెప్పారు. పోచారం సూచనలకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. భవిష్యత్‌​లో పోచారం శ్రీనివాస్​ రెడ్డికి సముచిత గౌరవం కల్పిస్తామని సీఎం రేవంత్​ హామీ ఇవ్వడం గమనార్హం.

రైతు రుణమాఫీ విధివిధానాలపై ఇవాళ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నామని సీఎం రేవంత్ చెప్పారు. జామాబాద్​ జిల్లాలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు పోచారం సహకారం తీసుకుంటామన్నారు. రైతు సంక్షేమం కోసం అవసరమైన అందరినీ కలుపుకునిపోతామని సీఎం రేవంత్ చెప్పుకొచ్చారు.

మరోవైపు, బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పోచారం ఇంట్లో సీఎం రేవంత్​ ఉండగానే ఇంటి బయట బీఆర్​ఎస్​ నేతలు నిరసనలకు దిగారు. పోచారం నివాసం వద్ద బాల్క సుమన్​, బీఆర్​ఎస్​ నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఆందోళనకు దిగిన బీఆర్​ఎస్​ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ నేతల మధ్య తోపులాట, వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో బాల్క సుమన్​, బీఆర్​ఎస్​ నేతలను పోలీసులు అరెస్ట్ చేసి అక్కడ్నుంచి తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+