ఎమ్మెల్యే పేరు చెబితే సిగ్గుపడాలా?: రాజయ్యపై కడియం శ్రీహరి పరోక్ష వ్యాఖ్యలు
హైదరాబాద్: ష్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం స్టేషన్ ఘన్‌పూర్‌లో బీఆర్ఎస్ కార్యకర్తలతో కడియం శ్రీహరి ఆత్మీయ సమ్మేళనం నిర్వహంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను స్టేషన్ ఘన్‌పూర్ కు వస్తున్నానంటే.. గోకేవారు, గీకేవాళ్లు, భూ కబ్జాదారులు పారిపోవాల్సిందేనని అన్నారు.
స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ ప్రజల రాజకీయ భిక్ష వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నట్టు చెప్పారు కడియం శ్రీహరి. తాను చెడు ప్రవర్తనతో ప్రజలకు, కార్యకర్తలకు తలవంపులు తెచ్చేపని చేయలేదన్నారు. తాను తప్పు చేయనని భరోసా ఇస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉందని చెప్పారు. అందులో స్టేషన్ ఘన్‌పూర్ కూడా ఉందన్నారు.

మార్పు జరిగి తనకు అవకాశం వస్తే నిండు మనసుతో ఆశీర్వదించాలని కడియం శ్రీహరి విజ్ఞప్తి చేశారు. ఇన్ని రోజులు మీ ఎమ్మెల్యే ఎవరు అంటే చెప్పుకోవడానికి సిగ్గుపడేది.. నాకు అవకాశం వస్తే మీరందరూ నన్ను ఆశీర్వదించిన తర్వాత మీ ఎమ్మెల్యే ఎవరు అంటే గల్లా ఎగరవేసుకుని చెప్పేలా పనిచేస్తానని కడియం శ్రీహరి తెలిపారు.
కడియం శ్రీహరి వస్తే.. అవినీతిపరులకు హడల్.. నేను వస్తున్నాను అంటే గోకేవారు, గీకేవారు, భూ కబ్జాదారులు పారిపోవాల్సిందే.. నన్ను ఆశీర్వదిస్తే స్టేషన్ ఘన్‌పూర్ ను మున్సిపాలిటీ చేసి ఆదర్శవంతంగా అభివృద్ధి చేస్తానని కడియం శ్రీహరి స్పష్టం చేశారు. కాగా, స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం నుంచి కడియం శ్రీహరి పోటీ చేసేందుకు ఇప్పటికే కసరత్తులు మొదలుపెట్టారు.
ఎమ్మెల్యే రాజయ్యకు పోటీగా నియోజకవర్గంలో సభలు, సమావేశాలు పెడుతూ కడియం శ్రీహరి ప్రజలను తనవైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు, రాజయ్య కూడా ఎక్కడా తగ్గకుండా కడియంపై పరోక్ష విమర్శలు చేస్తూ మరోసారి స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తానేనంటూ చెబుతున్నారు. తాజాగా, రాజశ్యామల యాగం చేసిన రాజయ్య.. స్టేషన్ ఘన్‌పూర్ టికెట్ తనకేనని.. తన గెలుపు కూడా ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications