బీఆర్ఎస్‌ను ఖాళీ చేస్తోన్న రేవంత్: దానం నాగేందర్ ఘర్ వాపసీ: ఎంపీకీ కాంగ్రెస్ కండువా
Danam Nagender: లోక్‌సభ ఎన్నికల ముంగిట్లో ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితిపై దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఒకవంక- ఈ ఎన్నికల్లో విజయం సాధించడానికి పార్టీ అగ్రనాయకత్వం వ్యూహాలను రూపొందించుంటోండగా.. మరోవంక- సీనియర్లు షాకుల మీదు షాకులు ఇస్తోన్నారు. ఇతర పార్టీలకు వలస వెళ్తోన్నారు.
ఇప్పటికే కొందరు సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు.. కారు దిగారు. ప్రత్యామ్నాయ పార్టీల్లో చేరిపోయారు. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ కండువాలను కప్పుకొన్నారు. సిట్టింగ్ ఎంపీలు రాములు, బీబీ పాటిల్, వెంకటేష్ నేత, పసునూరి దయాకర్, బొంతు రామ్మోహన్, టీ రాజయ్య, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, పట్నం సునీత మహేందర్ రెడ్డి.. వంటి నేతలు బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పారు.
బీజేపీ, కాంగ్రెస్ కండువాలను కప్పుకొన్నారు.

అదే జాబితాలో తాజాగా ఖైరతాబాద్ శాసన సభ్యుడు, మాజీ మంత్రి దానం నాగేందర్, చేవెళ్ల లోక్‌సభ సభ్యుడు రంజిత్ రెడ్డి సైతం చేరిపోయారు. కొద్దిసేపటి కిందటే వారిద్దరూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
గతంలో దానం నాగేందర్ సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్‌లో కొనసాగిన విషయం తెలిసిందే. గతంలో ఆసిఫ్ నగర్, అనంతరం ఖైరతాబాద్ నుంచి అసెంబ్లీ ఎన్నికయ్యారు. 2004 ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీలో చేరి మళ్లీ వెనక్కి వచ్చారు. 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఖైరతాబాద్ నుంచి గెలిచారు. అనంతరం మంత్రిగా పని చేశారు.
రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్‌కు దూరం అయ్యారు. బీఆర్ఎస్‌లో చేరారు. 2018, 2023 ఎన్నికల్లో ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో సొంతగూటికి వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకుంటోన్నారు దానం నాగేందర్.

2019 నాటి ఎన్నికల్లో రంజిత్ రెడ్డి.. చేవెళ్ల లోక్‌సభ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు. కాంగ్రెస్‌కు చెందిన కొండా విశ్వేశ్వర్ రెడ్డిని 14 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో ఓడించారు. ఈ దఫా రంజిత్ రెడ్డికి టికెట్ ఇవ్వలేదు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. ఆయనకు బదులుగా కాసాని జ్ఞానేశ్వర్‌ను బరిలో దించారు.
రంజిత్ రెడ్డిని మరోసారి అవకాశం ఇవ్వకపోవచ్చంటూ ఇదివరకే వార్తలొచ్చాయి. దీనితో సిట్టింగ్ ఎంపీనే అయినప్పటికీ- కేసీఆర్ స్వయంగా నిర్వహించిన చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం సమీక్ష సమావేశానికి గైర్హాజర్ అయ్యారు. ఇక మొత్తంగా పార్టీకీ దూరం అయ్యారు. బీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన రెండు గంటల్లోనే కాంగ్రెస్ తీర్థాన్ని పుచ్చుకున్నారు.












Click it and Unblock the Notifications