వ్యూహం మార్చిన కేసీఆర్ - రేవంత్ పై కొత్త అస్త్రం..!!
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తవుతోంది. దీంతో.. అధికార పార్టీ రాజకీయంగా దూకుడు ప్రదర్శిస్తూ బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తోంది. రాష్ట్రంలో త్వరలో వరుస ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో ప్రధాన పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. ప్రత్యర్థుల పైన గురి పెడుతున్నాయి. కాగా.. మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్.. సీఎం రేవంత్ లక్ష్యంగా కొత్త వ్యూహం సిద్దం చేస్తున్నారు. రేవంత్ పై కౌంటర్ ప్లాన్ తో ముందుకు వెళ్లాలని డిసైడ్ అయ్యారు.
రాష్ట్రంలో కాంగ్రెస్- బీఆర్ఎస్ రాజకీయం ఆసక్తిగా మారుతోంది. బీఆర్ఎస్ లక్ష్యంగా సీఎం రేవంత్ వరుస అస్త్రాలను సంధిస్తున్నారు. గులాబీ పార్టీ అగ్రనేతల నియోజకవర్గాల పైన గురి పెట్టారు. కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ రేవంత్ కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. బీఆర్ఎస్ కోర్ టీం ను ఆత్మరక్షణలోకి నెట్టే విధంగా అడుగులు వేస్తున్నారు. ఈ సమయంలోనే మాజీ సీఎం కేసీఆర్ పార్టీ ముఖ్య నేతలతో వరుసగా చర్చలు చేస్తున్నారు. త్వరలో జరిగే ఎన్నికలతో పాటుగా పార్టీ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాల పైన చర్చిస్తున్నారు. సీఎం రేవంత్ నిర్వహిస్తున్న సభలకు కౌంటర్‌గా కొడంగల్‌లో బహిరంగ సభ నిర్వహించాలని ఆలోచన చేస్తున్నారు. అదే విధంగా మంత్రుల నియోజకవర్గాల్లో సభలు నిర్వహించాలని డిసైడ్ అయింది. బీఆర్ఎస్ నేతల వ్యవసా య క్షేత్రాలు, ఫాంహౌస్‌ల వద్దకు వెళ్లి కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.

సీఎంతో సహా మంత్రుల నియోజకవర్గాల్లో సభలు
తాజాగా సీఎం రేవంత్ సిరిసిల్లలో పాదయాత్ర చేయడంతో పాటుగా బహిరంగ సభలో కేటీఆర్ లక్ష్యంగా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మాజీ మంత్రి హరీశ్ రావు ప్రాతినిథ్యం వహిస్తున్న సిద్దిపేటలో త్వరలోనే రేవంత్ పర్యటించేందుకు సిద్దం అవుతున్నారు. అదే విధంగా ప్రతిపక్ష నేత కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్‌లోనూ సీఎం పర్యటిస్తారని పార్టీ నేతల సమాచారం. దీంతో.. ఈ సమయంలోనే రేవంత్ వ్యూహాలను ధీటుగా ఎదుర్కునే విషయం పై కేసీఆర్ పార్టీ నేతలతో చర్చించారు. కౌంటర్‌గా రాజకీయ కార్యాచరణను మరింత ఉద్ధృతం చేయాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఇకపై కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ నాయకత్వం భావిస్తున్నట్ సమాచారం. కొడంగల్‌లోనే సభ నిర్వహించి రాజకీయంగా దీటైన సమాధానమివ్వాలని నిర్ణయించారు. ఆ తరువాత వరుసగా మంత్రుల నియోజకవర్గాల్లోనూ సభలు కొనసాగించేలా కార్యాచరణ ఖరారు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications
