ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్: తొలి అడుగు
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో భారత రాష్ట్ర సమితి(BRS) కార్యాలయం ప్రారంభమైంది. ఢిల్లీలోని వసంత్ విహార్‌లో నిర్మించిన కార్యాలయం 'బీఆర్ఎస్ భవన్'(BRS Bhavan)ను ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(KCR) గురువారం మధ్యాహ్నం ప్రారంభించారు. వాస్తుపూజ, సుదర్శన హోమం నిర్వహించిన అనంతరం మధ్యాహ్నాం 1.05 గంటలకు బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించి లోపల అడుగుపెట్టారు కేసీఆర్.
అనంతరం భవనంలోని మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన తన ఛాంబర్‌కు కేసీఆర్ వెళ్లి కుర్చీలో ఆసీనులయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు పార్టీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. మరికాసేపట్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలతో కేసీఆర్ తొలి సమావేశం నిర్వహించనున్నారు. అంతకుముందు పార్టీ కార్యాలయం ఆవరణలో బీఆర్ఎస్ జెండాను కేసీఆర్ ఆవిష్కరించారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎంపీలు కేశవరావు, వెంకటేశ్ నేత, సంతోష్ కుమార్‌తో పాటు మంత్రులు, బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిదులు కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం రెండు రోజులు ఢిల్లీలో ఉండి పలు విపక్ష పార్టీల నేతలు, వివిధ రంగాల్లోని ప్రముఖులతో ఆయన సమావేశమయ్యే అవకాశం ఉంది.
Bharat Rashtra Samithi (BRS) President, CM Sri K Chandrashekhar Rao inaugurated the party’s central office building at Vasant Vihar in New Delhi today. pic.twitter.com/zuBvRXns3s
— BRS Party (@BRSparty) May 4, 2023
కాగా, ఢిల్లీ వసంత్ విహార్‌లో బీఆర్‌ఎస్ కార్యాలయ నిర్మాణానికి 2021, సెప్టెంబర్ 2న సీఎం కేసీఆర్ భూమి పూజ చేశారు. మొత్తం నాలుగు అంతస్థులతో 11 వేల చదరపు అడుగుల స్థలంలో దీనిని నిర్మించారు. లోయర్‌గ్రౌండ్‌లో మీడియా హాల్, సర్వెంట్ క్వార్టర్స్ ఉన్నాయి.
Here are a few more glimpses from the inauguration ceremony of the BRS Party's central office in New Delhi. pic.twitter.com/jxedmv8Wrl
— BRS Party (@BRSparty) May 4, 2023
కార్యాలయ గ్రౌండ్‌ఫ్లోర్‌లో క్యాంటీన్, రిసెప్షన్ లాబీ, 4 ప్రధాన కార్యదర్శుల చాంబర్‌లు, మొదటి అంతస్థులో బీఆర్‌ఎస్ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ చాంబర్, ఇతర చాంబర్స్, కాన్ఫరెన్స్ హాల్స్, 2వ, 3వ అంతస్థుల్లో మొత్తం 20 గదులు ఉన్నాయి. వీటిలో పార్టీ ప్రెసిడెంట్ సూట్, వర్కింగ్ ప్రెసిడెంట్ సూట్‌పోగా మిగతా 18 ఇతర రూములు అందుబాటులో ఉంటాయి.












Click it and Unblock the Notifications