కాంగ్రెస్ 42% బీసీ రిజర్వేషన్ల డ్రామా..చిత్తశుద్ధి ఉంటే..!!

బీసీ రిజర్వేషన్ల పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల తో రాజకీయంగా రేవంత్ ప్రభుత్వం టార్గెట్ అవుతోంది. 42 శాతం బీసీ రిజర్వేషన్లు రేవంత్ ఆడిన డ్రామా అంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఆరు గ్యారెంటీల తరహాలోనే బీసీ రిజర్వేషన్ల విషయంలోనూ వ్యవహరించి.. వారి ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసారని ఫైర్ అవుతున్నాయి. బీసీ రిజర్వేషన్లు సాధించేందుకు తాము కలిసి వస్తామని.. చిత్తశుద్ది ఉంటే ఢిల్లీ వేదికగా కోట్లాడాలని సవాల్ చేస్తున్నాయి.

బీసీ రిజర్వేషన్ల పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు జారీ చేసిన జీవో నెంబర్ 9 తో పాటుగా ఆ జీవో ఆధారంగా విడుదల చేసిన స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ పైనా హైకోర్టు స్టే విధించింది. దీంతో, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ నేతలు రేవంత్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నాయి. ఆరు గ్యారెంటీల లాగే, కాంగ్రెస్ 42% బీసీ రిజర్వేషన్ల డ్రామా అని.. 55 ఏళ్లు కేంద్రంలో అధికారంలో ఉండి కాంగ్రెస్ ఏనాడైనా బీసీ రిజర్వేషన్ల కోసం పాటు పడిందా అంటూ బీఆర్ఎస్ నేత హరీష్ రావు ప్రశ్నించారు.

brs-reacts-over-high-court-interim-orders-on-bc-reservtions-slams-congress-govt

చిత్తశుద్ధి ఉంటే మీ కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులతో డిల్లీ వేదికగా కోట్లాట పెట్టండి..కలిసి రావడానికి బీఆర్ఎస్ సిద్దంగా ఉందని చెప్పుకొచ్చారు. మాయ మాటలు చెప్పి గత ఎన్నికల్లో బీసీలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ .. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ లబ్ది పొందాలని చేసిన కుట్రలు పటాపంచలయ్యాయని చెప్పారు. 22 నెలలుగా బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో కొట్లాడాల్సిన సీఎం రేవంత్ గల్లీలో కొట్లాడుతున్నట్లు డ్రామా క్రియేట్ చేసారు తప్ప, బీసీలకు 42శాతం రిజర్వేషన్ సాధించడం పట్ల ఏనాడూ చిత్తశుద్ది ప్రదర్శించలేదని మండి పడ్డారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం, 42శాతం రిజర్వేషన్ కల్పించేందుకు చట్ట బద్దత కోసం కేంద్రాన్ని పట్టుబట్టాల్సిన రేవంతు రెడ్డి, తెలివిగా దాన్ని పక్క దోవ పట్టించారని విమర్శించారు.

https://twitter.com/BRSHarish/status/1976237493239550103

బీసీల పట్ల తమకు నిజంగానే ప్రేమ ఉన్నట్లు చాటుకునేందుకు తూతూ మంత్రంగా జీవో ఇచ్చి కొత్త నాటకానికి తెరతీసారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేసారని చెప్పుకొచ్చారు. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా మీ డ్రామాలు ఆపాలని.. మీకు, మీ పార్టీకి బీసీల పట్ల నిజంగా చిత్తశుద్ది ఉంటే 42శాతం పెంపు విషయమై ఢిల్లీలో కొట్లాడాలని సూచించారు.పార్లమెంట్ లో చట్టం చేయించి, షెడ్యుల్ 9లో చేర్చండని హరీష్ సూచించారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ పోరాటంలో అఖిల పక్షాలను భాగస్వామ్యం చేయాలని కోరారు. ఢిల్లీ వేదికగా యుద్ద భేరి మోగించాలని... ఉద్యమ పార్టీగా బిఆర్ఎస్ ఎల్లప్పుడూ బీసీల కోసం గొంతెత్తుతుందని హరీష్ పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+