సినిమా ముందుంది: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు వచ్చే సీట్లపై తేల్చేసిన కేటీఆర్

హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో గతంలో కంటే ఎక్కువ స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. నానక్‌రామ్‌గూడలో క్రెడాయ్ కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 95-100 స్థానాలను గెలుచుకుంటామన్నారు. ఈ తొమ్మిదేళ్లలో చూసింది ట్రైలర్ మాత్రమేనని.. కేసీఆర్ మదిలో ఇంకా చాలా ప్రణాళికలు ఉన్నాయన్నారు.

హైదరాబాద్ చాలా అభివృద్ధి చెందిందని.. తెలంగాణది సమగ్ర, సమీకృత, సమతుల్య అభివృద్ధి అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. తాగునీరు, విద్యుత్ సరఫరా సులభమే అయితే.. గత ప్రభుత్వాలు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం ఏర్పాటైన మొదట్లో కొంతమంది కూల్చేయాలని ప్రయత్నం చేశారని ఆరోపించారు. మూడోసారి కూడా బీఆర్ఎస్ అధికారంలోకి రానుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

BRS will win 95-100 seats in next assembly elections: KTR in credai opening ceremony

'స్థిరమైన, ధృడమైన, బలమైన నాయకత్వం మన రాష్ట్రానికి ఉండటం మనందరి అదృష్టం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ కొత్తలో చాలా మంది అనుమానాలు వ్యక్తం చేశారు. 119 స్థానాలు సింఫుల్​ మెజారిటీ 60.. 10 నుంచి 15 సీట్లు అటుఇటు అయిపోతే రాష్ట్రం అస్థిరం అయిపోతుందని తెలంగాణ వ్యతిరేకులు ఆగం చేశారు.

ప్రతిపక్షాలకు క్లారిటీ ఉండకపోవచ్చు ఏమో గానీ.. ప్రజలకు స్పష్టమైన క్లారిటీ ఉంది. మంచిగా పనిచేసే ప్రభుత్వాన్ని పిచ్చోళ్లు కూడా వదులుకోరు. చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకుంటున్నాం. మొదటి ఎన్నికల్లో బీఆర్​ఎస్​ 63 సీట్లతో గెలిస్తే.. 2018 ఎన్నికల్లో 88 సీట్లు గెలిచాం. ఇప్పుడు జరగబోయే 2023 ఎన్నికల్లో 95 నుంచి 100 స్థానాల్లో కచ్చితం గెలుస్తాం' అని కేటీఆర్ స్పష్టం చేశారు.

గత 9 ఏళ్లలో తెలంగాణ రాష్ట్ర ప్రగతిని అద్భుతమని వ్యాఖ్యానించారు. నేడు హైదరాబాద్ నగరం ఎంతో అభివృద్ధి చెందిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. నగరవాసులంతా హైదరాబాద్‌​ను చూసి గర్వపడే విధంగా హైదరాబాద్ రూపుదిద్దుకుందన్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా హైదరాబాద్ అభివృద్ధిని ప్రశంసించారని గుర్తు చేసుకున్నారు.

నాయకుడికి దృఢ సంకల్పం ఉంటే .. ప్రజలకు మంచి చేయాలని ఆలోచన ఉంటే మార్పు ఖచ్చితంగా వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్‌​తో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, చేవెళ్ల పార్లమెంటు సభ్యుడు జి.రంజిత్‌రెడ్డి, రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌, ఎల్‌బి నగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, సీఐఐ తెలంగాణ చైర్మన్‌, క్రెడాయ్ నేషనల్ మాజీ అధ్యక్షుడు సి శేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+