అరవింద్‌ను ఓడిస్తాం: 100 సీట్లతో బీఆర్ఎస్ హ్యాట్రిక్ అంటూ కవిత, రాహుల్‌పై సెటైర్లు
నిజామాబాద్: తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీనేనని ఆ పార్టీ ఎమ్మెల్యే కల్వకుంట్ల కవిత ధీమా వ్యక్తం చేశారు. నిజామాబాద్‌లో చిట్‌చాట్‍లో ఆమె పలు అంశాలపై స్పందించారు. కేసీఆర్ పథకాల సృష్టికర్త అని.. ఇతర పార్టీల మేనిఫెస్టోను కాపీ కొట్టాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణలో వంద సీట్లతో బీఆర్ఎస్ మూడోసారి అధికారం చేపడుతుందని జోస్యం చెప్పారు.
ఈ క్రమంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కవిత. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు తెలంగాణలో ఉన్నాయని.. అందుకే సీఎం కేసీఆర్(KCR) పథకాల సృష్టికర్త అని ఎమ్మెల్సీ కవిత కొనియాడారు. బీఆర్ఎస్ పార్టీకి ఇతర పార్టీల మేనిఫెస్టోని కాపీ చేయాల్సిన అవసరం లేదని.. తమ పథకాలనే ఇతర పార్టీలు కాపీ కొడుతున్నాయని తెలిపారు.

కాంగ్రెస్, బీజేపీకి చెందిన కొందరు నాయకులు కేసీఆర్‌పై పోటీ చేయాలని చూస్తున్నారని.. ఈసారి కేసీఆర్ పై ఎవరు పోటీ చేసినా ఓటమి తప్పదని కవిత వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీజేపీకి అసలు అవకాశమే లేదని.. ఆ పార్టీకి డిపాజిట్లు దక్కడం కూడా కష్టమేనని కవిత చెప్పుకొచ్చారు. మరోవైపు, కోరుట్లలో బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ను ఓడిస్తామన్నారు ఎమ్మెల్సీ కవిత.
గాంధీలకే గ్యారంటీ లేదు.. అలాంటిది కాంగ్రెస్ గ్యారెంటీలను ప్రజలు ఎలా నమ్ముతారని కవిత చురకలంటించారు. బీసీలకు గొడ్డలి పెట్టు కాంగ్రెస్ అని ఆమె మండిపడ్డారు. రాష్ట్రంలో మైనార్టీలను కాంగ్రెస్ కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తోందన్నారు. ఈసారి ఎన్నికలు రాహుల్ వర్సెస్ రైతులుగా ఉంటారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు. రైతుబంధుపై కాంగ్రెస్ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారని మండిపడ్డారు కవిత.
Congress is anti-farmer, anti-Dalit & anti-progress! They hit a new low by opposing Telangana's 'Rythu Bandhu' & ‘Dalit Bandu’ schemes for farmers and Dalits. It's disheartening but not surprising to witness their anti-farmer stance, hindering the welfare initiatives that have… https://t.co/2FZWaeiyKj
— Kavitha Kalvakuntla (@RaoKavitha) October 26, 2023
కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేకి, దళిత వ్యతిరేకి, అభ్యుదయ వ్యతిరేకి అని ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. రైతులు, దళితుల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు, దళిత బంధు వంటి సంక్షేమ పథకాలను ప్రవేశ పెడితే.. వాటిని కాంగ్రెస్ వ్యతిరేకిస్తే కొత్త పతనాన్ని చవిచూస్తుందని హెచ్చరించారు. గత ఆరేళ్లుగా వ్యవసాయ రంగంలో గణనీయమైన అభివృద్ధిని తెలంగాణ చూస్తోందన్నారు. వాటిలో భాగంగా రైతులకు రైతు బంధు అనే దేశంలోనే రైతుల కోసం ఆలోచించిన తొలి రాష్ట్రం తెలంగాణ అని కొనియాడారు.












Click it and Unblock the Notifications