క్లూ ఇలా: నయీం ఎన్‌కౌంటర్లో 'బిజినెస్‌మెన్', భార్య ఇంటివద్ద పోలీసులు
హైదరాబాద్: మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ నయీం ఆచూకీ కోసం పోలీసులు చాలా రోజులుగా గాలిస్తున్నారు. అయితే, బెదిరించి, డబ్బులు వసూలు చేసే క్రమంలో నయీం పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. అంతేకాదు ఎన్‌కౌంటర్లో హతమయ్యాడు.
మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్‌లో జరిగిన నయీం ఎన్ కౌంటర్‌కు సంబంధించి కీలక అంశాలు వెలుగు చూస్తున్నాయి. సమాచారం మేరకు.. బెదింపులతో కోట్లాది రూపాయలను వసూలు చేసిన నయీం తన దందాను కొనసాగిస్తున్నాడు.
ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ పెద్ద వ్యాపారవేత్తకు ఫోన్ చేసిన నయీం రూ.కోటీ తెచ్చివ్వాలని హుకుం జారీ చేసిన విషయం తెలిసిందే. షాద్ నగర్‌కు తాను చేరుకునే సమయంలో డబ్బుతో అక్కడ సిద్ధంగా ఉండాలని సదరు వ్యాపారిని బెదిరించాడు.

ఈ క్రమంలో సదరు వ్యాపారి నిజామాబాద్ పోలీసులను ఆశ్రయించాడని తెలుస్తోంది. దీంతో నయీం ఆట కట్టించేందుకు పోలీసులు సిద్ధమయ్యారని సమాచారం. ఆ వ్యాపారి ఫిర్యాదు నేపథ్యంలో జిల్లాలోని డిచ్‌పల్లి పోలీస్ స్టేషన్ కేసు నమోదయింది. నయీం చెప్పిన సమయానికి నిఘా పెట్టిన పోలీసులు... అతనిని హతమార్చారు. కాగా, నయీం భువనగిరి, నకిరేకల్ ఎమ్మెల్యేలను బెదిరించాడని తెలుస్తోంది.
నలుగురు అనుచరుల పట్టివేత
శంషాబాదులో నయీం నలుగురు అనుచరులను పోలీసులు అరెస్టు చేశారు. ఇదిలా ఉండగా, హైదరాబాదులోని నార్సింగి ప్రాంతంలో ఉన్న ఓ ఇంటిని పోలీసులు చుట్టుముట్టారని తెలుస్తోంది. అందులో నయీం భార్య, పిల్లలు ఉన్నట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications