అనుమానాస్పద స్థితిలో లాడ్జీలో వ్యాపారి మృతి: తల్లి మందలించిందని...
హైదరాబాద్: హైదరాబాదులో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఈ సంఘటన హైదరాబాదులోని సుల్తాన్‌బజార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్‌కు చెందిన గుండా ప్రమోద్‌కుమార్ (38) స్థానికంగా లారీలను కిరాయికి ఇచ్చే వ్యాపారం నిర్వహిస్తున్నాడు. మంగళవారం నగరానికి చేరుకుని కోఠి హరిద్వార్ హోటల్ లాడ్జిలోని 308 గదిని అద్దెకు తీసుకున్నాడు.
టీకేఆర్ కాలేజ్‌లో బీటెక్ చేస్తున్న అల్లుడు ప్రణీత్‌ను కలిసి వచ్చిన అనంతరం రాత్రి హరిద్వార్ హోటల్‌లోనే భోజనం చేసి గదికి చేరుకున్నాడు. బుధవారం ఉదయం రూంబాయ్ ప్రసాద్ గదిని శుభ్రం చేసేందుకు తలుపు తట్టినా ఎంతకు తీయలేదు. ఈ విషయాన్ని మేనేజర్ శ్రీనివాస్‌కు చెప్పగా వారు కిటికీ తలుపు తెరిచిన వారికి బెడ్‌షీట్‌తో కిటికీ పైన ఉన్న కొక్కానికి ఉరి వేసుకొని ప్రమోద్‌కుమార్ కనిపించాడు.

దాంతో మేనేజర్ శ్రీనివాస్ పోలీస్ స్టేషన్ చేరుకుని ఫిర్యాదు చేశాడు. ఎస్‌ఐ రాంరెడ్డి పరిశీలించారు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని రాసి ఉంచిన సూసైడ్ నోట్ దొరికింది. ప్రమోద్‌కుమార్ వద్ద ఉన్న సెల్‌ఫోన్ ఆధారంగా అల్లుడు ప్రణిత్‌తో పాటు బంధువులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఉస్మానియా మార్చురీకి తరలించారు.
తల్లి మందలించిందని...
తల్లి మందలించిందని ఓ మహిళ సాగర్ నీటిలో దూకేందుకు ప్రయత్నిస్తుండగా లేక్ పోలీసులు రక్షించారు. అత్తాపూర్ కు చెందిన రవి భార్య అంజలి(26) ఆ అఘాయిత్యానికి ప్రయత్నించింది. రవికి, అంజలికి 2006 లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు .
మూడేళ్ళ క్రితం రవి అనారోగ్యంతో చనిపోవడంతో అంజలి కాచిగూడలోని సుందర్ నగర్‌లో తల్లిగారింటి వద్దనే ఉంటోంది. ఇళ్ళలో పని చేస్తూ జీవనం సాగిస్తుంది. మంగళవారం చిన్న విషయానికి తల్లితో గొడవ పడి ంది. తల్లి మందలించడంతో మనస్తాపం చెంది సాగర్‌లో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. లేక్ పోలీసులు అంజలికి కౌన్సిలింగ్ ఇచ్చారు.












Click it and Unblock the Notifications