చెప్పు తెగుద్ది, హీరోయిన్ల నగ్న చిత్రాలు తీసి బ్లాక్‌మెయిల్: నట్టిపై సి కళ్యాణ్ (వీడియో)

హైదరాబాద్: సినీ పరిశ్రమకు చెందిన నలుగురు నిర్మాతలకు నయీంతో సంబంధాలున్నాయన్న నట్టి కుమార్ వ్యాఖ్యలు పరిశ్రమలో ప్రకంపనలు రేపుతున్నాయి. నిర్మాతలు ఒక్కరొక్కరు నట్టి పైన నిప్పులు చెరుగుతున్నారు.

తాజాగా, సీ కళ్యాణ్ శుక్రవారం ఉదయం మీడియా మందుకు వచ్చారు. నట్టి కుమార్ ప్రజలను, ప్రభుత్వాలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. అతనో పిచ్చికుక్క అన్నారు. నట్టి కుమార్.. నోరి జారితే చెప్పు తెగుద్ది అని దుయ్యబట్టారు.

ఏసుక్రీస్తు పేరు చెప్పుకొని డబ్బులు దండుకుంటున్నాడన్నారు. నట్టి బాధితులు చాలామంది ఉన్నారని, అతని బాధితుల కోసం ఓ సెల్ ఏర్పాటు చేయాలన్నారు. నట్టిది బ్లాక్ మెయిలింగ్ చరిత్ర అన్నారు. అతనిని వెంటనే అదుపులోకి తీసుకొని.. అతని వద్ద నయీంతో సంబంధాలున్న ఆధారాలను తీసుకోవాలన్నారు.

నట్టి కుమార్‌తో పాటు ఆయన కుటుంబసభ్యుల పైనా సి కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నయీంతో సంబంధాలున్నాయన్న ఆరోపణలు నిజమని తేలితే ఎంతటి పెద్దవాళ్లనైనా అరెస్ట్ చేయవచ్చని పోలీసులకు సూచించారు. నయీం ఎవరో తనకు తెలియదని, తాను బహిరంగ చర్చకు సిద్ధమన్నారు.

తనతో పాటు పలువురు నిర్మాతలు, సినీ రంగానికి చెందిన ప్రముఖులను నట్టి కుమార్ నిలువునా మోసం చేశాడన్నారు. వైజాగ్ నుంచి తరిమేస్తే హైదరాబాద్ వచ్చి తలదాచుకున్నాడని ఆరోపించారు. నట్టి కుమార్ మాదిరే అతడి కొడుకు కూడా తనను మోసగించాడని సీ కల్యాణ్ ధ్వజమెత్తారు.

తన కొడుకు ప్రాజెక్టు రిపోర్టు కోసమని అడిగితే తన సినిమా.. ఎటో వెళ్లిపోయింది మనసు కాపీ ఇస్తే, దానిని నెట్లో పెట్టి, ఆపై కేసులకు భయపడి తన కాళ్లు పట్టుకున్నాడని అన్నారు. త్వరలోనే విశాఖ పట్నం బ్యాంకుల్లో నట్టికుమార్ జరిపిన కుంభకోణం బయటకు రానుందన్నారు. సినిమా పరిశ్రమ పైన ప్రేమతో వచ్చిన ఓ వ్యక్తిని మోసగించాడన్నారు.

నయీం కేసులో నట్టి కుమార్ వద్ద ఉన్న ఆధారాలను బయటపెట్టాలని కోరారు. నట్టి కుమార్ జీవితమే బ్లాక్ మెయిల్ అన్నారు. బ్లూఫిలిమ్స్ తీసి, నగ్నంగా ఉన్న అమ్మాయిల ఫోటోలు తీసుకొని కూడా బ్లాక్ మెయిల్ చేస్తారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

నీలి చిత్రాలు తీస్తూ, లీజుకు తీసుకున్న థియేటర్లను తనవని చెప్పుకుని బ్యాంకుల ఓడీ లావాదేవీలు నడిపించిన నట్టి కుమార్‌కు తనను విమర్శించే స్థాయి లేదన్నారు. తన సినిమాల్లో నటించే హీరోయిన్ల నగ్న చిత్రాలను తీసి వారినే బ్లాక్ మెయిల్ చేసిన చరిత్ర నట్టికుమార్‌ది అని సీ కళ్యాణ్ మండిపడ్డారు.

C Kalyan lashes out at Natti Kumar for his allegations

గురువారం నిర్మాతలు అశోక్ కుమార్, బూరుగుపల్లి శివరామకృష్ణ, కొడాలి వెంకటేశ్వర రావు తదితరులు మీడియాతో మాట్లాడిన విషయం తెలిసిందే.

పరిశ్రమపై నట్టి కుమార్ ఆరోపణలు చేయడం సరికాదని ప్రముఖ నిర్మాత కొడాలి వెంకటేశ్వరరావు హితవు పలికారు. నయీం మరణించాడు కనుక అతనిపై నట్టి కుమార్ ఆరోపణలు చేస్తున్నాడని, రేపు దావూద్ ఇబ్రహీం మరణించినా అతనితో సినీ పరిశ్రమకు లింకులున్నాయని ఆరోపిస్తాడన్నారు.

తెలుగు సినీ పరిశ్రమపై ఓ నలుగురైదుగురు వ్యక్తులు బురదజల్లుతుంటారని ప్రముఖ నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణ మండిపడ్డారు. తెలుగు సినీ పరిశ్రమలో సుమారు 2,000 మంది వరకు నిర్మాతలు ఉన్నారన్నారు.

వారిలో తప్పుడు పనులు చేసేవారు ఎంతమందని ప్రశ్నించారు. సినీ పరిశ్రమ అయినా, వ్యాపార, రాజకీయ వర్గాలైనా, ఇతర రంగాల్లో అయినా తప్పుడు పనులు చేసేవారు ఉంటారన్నారు. నయీం పేరు తాను తొలిసారి వింటున్నానని చెప్పారు. పబ్లిసిటీ కోసం నట్టి కుమార్ ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+