ఎయిర్ హోస్టెస్‌పై లైంగికదాడి: నిందితుడి అరెస్ట్, పట్టిచ్చిన సీసీ కెమెరాలు
హైదరాబాద్: శంషాబాద్‌లోని ప్రముఖ విమానయాన సంస్ధలో ఎయిర్ హోస్టెస్‌పై అత్యాచారయత్నానికి యత్నించిన క్యాబ్ డ్రైవర్ మీర్జా అహ్మద్ బేగ్ అలియాస్ ఇమ్రాన్‌ను బుధవారం సాయంత్రం రాజేంద్రనగర్, ఎస్‌ఓటీ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో అరెస్టు చేశారు.
శంషాబాద్ డీసీపీ సంప్రీత్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం... నగరంలోని ఓ ప్రైవేట్ ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్ హోస్టస్‌గా పనిచేస్తున్న యువతి మంగళవారం తెల్లవారుజామున 2 గంటలకు రాజేంద్ర నగర్‌లో తాను నివాసముంటున్న హ్యాపీ హోమ్ అపార్ట్‌మెంట్ నుంచి మెడిసిన్స్ కోనేందుకు బయటకు వచ్చింది.
స్థానికంగా ఉన్న మెడికల్ షాపుకు వెళ్లగా దుకాణం మూసి ఉండటంతో మెట్రో పిల్లర్ నెం.216 వద్ద వేచి చూస్తున్న సమయంలో క్యాబ్ డ్రైవర్ మీర్జా అహ్మద్ బేగ్ అలియాస్ ఇమ్రాన్ (25) యువతిని ఎక్కడికి వెళ్ళాలని అడిగాడు. దీంతో ఆమె మెడికల్ షాపుకు వెళ్ళాలని చెప్పి వాహనం ఎక్కింది.

ఈ క్రమంలో ఆమెను మెడికల్ షాపుకు తీసుకు వెళ్తానని చెప్పి నమ్మించిన ఇమ్రాన్.. ఆమెను మాటల్లో పెట్టి రూటు మార్చి శంషాబాద్, కిషన్‌గూడ ఓఆర్‌ఆర్ మీదుగా హిమాయత్‌సాగర్‌కు తీసుకు వెళ్లాడు. కారులో ముందు సీట్లో ఆమె కూర్చుని ఉండటంతో లైంగికదాడి చేయాలనే ఉద్దేశంతో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి షర్టును లాగాడు.
దుండగుడి చర్యలను పసిగట్టిన మహిళ అప్రమత్తమై ఆమె కేకలు పెట్టింది. వెంటనే ఆమెను గట్టిగా పట్టుకుని వెనకకు తోసి అత్యాచారంచేయ ప్రయత్నించాడు. మహిళ తీవ్రంగా ప్రతిఘటించడంతో ఇమ్రాన్ యువతిపై దాడి చేసి ఆమె సెల్‌ఫోన్ లాక్కుని పారిపోయాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని యువతిని ఇంటికి చేర్చారు. నిందితుడిపై దోపిడీ, అత్యాచారం సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని ఇమ్రాన్‌ను బుధవారం అరెస్టు చేశామని అన్నారు. సీసీటీవీ పుటేజీల ఆధారంగా నిందితుడి వాహనాన్ని గుర్తించి ఇమ్రాన్‌ను అరెస్ట్ చేశామని డీసీపీ వివరించారు.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications