వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దసరా పండుగ: పాలపిట్ట కోసం ప్రచారం, కెసిఆర్‌కు విజ్ఞప్తి (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: దసరా పర్వదినం నేపథ్యంలో పాలపిట్టను బలవంతంగా బంధించి తీసుకు వచ్చి చూపించకూడదని హ్యూమన్ సొసైటీ ఇంటర్నేషనల్ గురువారం నాడు ర్యాలీ తీసింది.

దసరా పర్వదినం నాడు పాలపిట్టను చూడటం ఆనవాయితీ. ఊళ్లల్లో అడవుల్లోకి, పొలాల్లోకి వెళ్లి పాలపిట్టను చూస్తుంటారు. అయితే, నగరంలో ఇటీవల పాలపిట్టను బంధించి తీసుకు వచ్చి కొందరు చూపిస్తున్నారు.

దీనిని వ్యతిరేకిస్తూ హ్యూమన్ సొసైటీ ఇంటర్నేషనల్ ర్యాలీ తీసింది. ఈ సందర్భంగా విద్యార్థులు ప్లకార్డులు పట్టుకొని ర్యాలీ తీశారు.

పాలపిట్ట

పాలపిట్ట

దసరా పర్వదినం నేపథ్యంలో పాలపిట్టను బలవంతంగా బంధించి తీసుకు వచ్చి చూపించకూడదని హ్యూమన్ సొసైటీ ఇంటర్నేషనల్ గురువారం నాడు ర్యాలీ తీసింది.

పాలపిట్ట

పాలపిట్ట

ముఖ్యమంత్రి గారూ... తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్టను రక్షించండి అంటూ ర్యాలీ సందర్భంగా ప్లకార్డులు ప్రదర్శించారు.

పాలపిట్ట

పాలపిట్ట

పాలపిట్టను హింసించకుండా ఈ ఏడాది దసరా పర్వదినాన్ని జరుపుకోవాలని, పాలపిట్టను బంధించవద్దని ప్లకార్డులు ప్రదర్శించారు.

పాలపిట్ట

పాలపిట్ట

చట్ట ప్రకారం పాలపిట్టలకు హానీ తలపెట్టవద్దని, దసరా సందర్భంగా వాటిని కొనవద్దని, పంజరంలో బంధించి తీసుకు రావొద్దని విజ్ఞప్తి చేశారు.

పాలపిట్ట

పాలపిట్ట

పాలపిట్ట (రోలర్)కు సహాయపడమంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. దసరా రోజు పాలపిట్టలను చూపించే క్రమంలో భాగంగా.. వాటిని బోనుల్లో బంధిస్తారు.

పాలపిట్ట

పాలపిట్ట

అంతేకాదు రెక్కలు ట్రిమ్ చేస్తారు. కొందరు విరిచేస్తారట కూడా. పాలపిట్టలను ముట్టుకోవద్దని, అలాగే బంధించి తెచ్చిన వారిని చూడవద్దని చెబుతున్నారు.

పాలపిట్ట

పాలపిట్ట

పాలపిట్టను రైతు నేస్తం అంటారు. పంటలను పాడు చేసే కీటకాలను తింటుంది. ఇలాంటి పాలపిట్టను హింసించవద్దని, కాపాడుకోవాలని చెబుతున్నారు.

English summary
Children holding up Palapitta awareness campaign posters. Support campaign to stop the display of palapittas during Dussehra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X