ఉస్మానియా ఆసుపత్రిలో కారు బీభత్సం (ఫోటోలు)
ఉస్మానియా ఆసుపత్రిలో గురువారం ఓ కారు బీభత్సం సృష్టించింది.ఓ డాక్టర్ కారులో ఆసుపత్రికి వచ్చి, దానిని పార్క్ చేయాల్సిందిగా సెక్యూరిటీ సిబ్బందికి చెప్పాడు.
హైదరాబాద్: ఉస్మానియా ఆసుపత్రిలో గురువారం ఓ కారు బీభత్సం సృష్టించింది. ఓ డాక్టర్ కారులో ఆసుపత్రికి వచ్చి, దానిని పార్క్ చేయాల్సిందిగా సెక్యూరిటీ సిబ్బందికి చెప్పాడు.

సెక్యూరిటీ సిబ్బంది పార్క్ చేసే సమయంలో కారు అదుపు తప్పి ఔట్ పేషెంట్ బ్లాక్ వైపు దూసుకెళ్లింది. ఈ సమయంలో బయట కూర్చున్న ఉమర్, ఇక్బాల్, కౌసర్ అనే రోగులు గాయపడ్డారు.

వారికి వైద్యులు వెంటనే చికిత్స అందించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సెక్యూరిటీ గార్డు నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications